E-Paper
Advertisement

BB Telugu 8 Promo: హౌస్ లోకి సుమక్క.. కంటెస్టెంట్స్ రహస్యాలు గుట్టు..!

BB Telugu 8 Promo: హౌస్ లోకి సుమక్క.. కంటెస్టెంట్స్ రహస్యాలు గుట్టు..!
Advertisement

BB Telugu 8 Promo.. బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. రేపటితో ఈ సీజన్ కాస్త పూర్తీ కాబోతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో కి ఎనిమిది మంది 6వ వారం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. అలా 22 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్లో పాల్గొన్నారు. ప్రస్తుతం టాప్ ఫైవ్ లో నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్, ప్రేరణ మొత్తం ఐదు మంది ఫైనలిస్ట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వీరందరిలో నిఖిల్, గౌతమ్ టైటిల్ రేస్ లో పోటీ పడుతున్నారు. ఇద్దరిలో నువ్వా నేనా అంటూ టైటిల్ కోసం పోటీ పడుతూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండగా అన్నపూర్ణ స్టూడియోలో ఏడెకరాలలో..భారీ సెట్ వేసి ఈ షోని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక రేపు గ్రాండ్ ఫినాలే జరగబోతున్న నేపథ్యంలో గత సీజన్లో లాగా అల్లర్లు జరగకుండా మొత్తం 53 కెమెరాలను అన్నపూర్ణ స్టూడియో చుట్టూ అమర్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక ఈసారి సీజన్ ని చాలా పగడ్బందీగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ (Allu Arjun) చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజు సుమక్క హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని ఎవరికి తెలియని రహస్యాలను బయటపెట్టి అందరిని నవ్వించింది. అంతేకాదు సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా 104 రోజుకు సంబంధించి ప్రోమో ని బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేయడం జరిగింది అందులో సుమక్క తన ఎంట్రీ తోనే మంచి జోష్ నింపింది. బిగ్ బాస్ హౌస్లోకి మీకు స్వాగతం అని సుమాకు స్వాగతం పలికారు బిగ్ బాస్. దానికి సుమా మాట్లాడుతూ.. మీ వాయిస్ నా వాయిస్ ఎప్పటికీ ఓల్డ్ కావు.. అంటూ తెలిపింది.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో ఒక టాస్క్ ఆడింది. అందులో భాగంగానే మూడు రోజుల పాటు నేను ఈ పని చేయలేదు అంటూనే.. మూడు రోజులపాటు మీరు స్నానం చేయకుండా ఉన్న రోజులు ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. దాంతో ప్రేరణ జెడ్ స్పీడ్ లో వెళ్లి అక్కడున్న గ్రీన్, రెడ్ కలర్ జ్యూస్ లలో రెడ్ కలర్ జ్యూస్ తాగుతుంటే.. అర్థమయి వెళ్లిందా? అర్థం కాక వెళ్లిందా? అని సుమా అంటుండగానే ప్రేరణ 4 డేస్ అంటూ ఆశ్చర్యపరిచింది. మళ్లీ రకరకాల ప్రశ్నలతో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రశ్నించగా ఇక అందరూ కూడా ఎవరికి వారు రివీల్ అయిపోయి అందర్నీ నవ్వించారు.

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×