Paris Paralympics Archery| ధనుర్ విద్య లో భారత దేశ టాప్ పారాలింపిక్ ఆర్చర్ హర్విందర్ సింగ్ పారిస్ పారాలింపిక్స్ పోటీల్లో చరిత్ర సృష్టించాడు. బుధవారం, సెప్టెంబర్ 4, 2024న దేశం కోసం ఆర్చరీలో తొలి బంగారు పతకం సాధించాడు. పురుషుల సింగిల్స్ పోటీల్లో పోలాండ్ కు చెందిన లుకాజ్ సిస్జెక్ ఆటగాడిని 6-0 తో ఓడించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
ఇంతకుముందు 2020 టోక్యో పారాలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్న హర్విందర్ సింగ్ సెమీ ఫైనల్లో 1-3 తో తడబడుతూ ఆ తరువాత 7-3 స్కోర్ తో ఇరాన్ కు చెందిన మొమహమ్మద్ రెజీ అరబ్ అమేరీ ని ఓడించాడు. భారత దేశం నుంచి ఆర్చరీ విభాగంలో ఒక ఆటగాడు ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్ ఫైనల్లో చేయడం ఇదే తొలిసారి. అయితే తొలిసారి పోటీ చేస్తూనే చాంపియన్ గా అవతరించాడు హర్విందర్ సింగ్.
అంతకుముందు హర్యణాకు చెందిన 33 ఏళ్ల హర్విందర్ సింగ్ క్వార్టర్ ఫైనల్లో కొలంబియాకు చెందిన హెక్టర్ జూలియా రామిరెజ్ ని, ఇండోనేషియా కు చెందిన సెటియావాన్ సెటియావాన్ ని 16 వ రౌండ్ లో , చైనా కు చెందిన త్సెంగ్ లుంగ్ హుయిని 32 వ రౌండ్ లో ఓడించాడు.
అయితే ఫైనల్లో మాత్రం హర్విందర్ పూర్తి డామినెన్స్ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థి లూకాజ్ ఏ దశలోనూ రాణించకలేకపోయాడు. మొత్తం మూడు సెట్లలో నాలుగు పదులు, అయిదు 9 లు స్కోర్ పాయింట్లు సాధించాడు.
Also Read: పారాలింపిక్స్.. 20 పతకాలతో భారత్ జోరు
ఆర్చరీలో బంగారు పతకం రావడంతో భారత దేశానికి ఈ పారాలింపిక్స్ లో ఇప్పటివరకు నాలుగు బంగారు పతకాలు లభించాయి. మొత్తం కాంస్య, రజక పతకాలతో కలిపితే పతకాల సంఖ్య 22 కి చేరింది. మెడల్స్ సాధించిన దేశాల జాబితాలో ఇండియా ప్రస్తుతం 15వ స్థానంలో కొనసాగుతోంది. పారాలింపిక్స్ పూర్తయ్యే లోపు ఇలాగే కొనసాగితే భారత్ టాప్ 20 లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది.
ఇంతకుముందు భారత దేశం కోసం మిక్స్ డ్ ఆర్చరీ పోటీల్లో శీతల్ దేవి, రాకేష్ కుమరా్ కాంస్య పతకం సాధించడం గమనార్హం. ఇండియా ఖతాలో ఇప్పటివరకు ఆర్చెరీ, జావెలిన్, షూటింగ్, బ్యాడ్మింటన్ పారాలింపిక్స్ పోటీల్లో బంగారు పతకాలు లభించాయి.