Bigg Boss8: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 14మంది హౌస్‌మేట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారిలో ఎక్కువగా టీవీ, మూవీ నటులే ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు నుంచే బిగ్ బాస్ ఆట మొదలైంది. వాళ్లలో వాళ్లే గొడవలు పెట్టేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఇక హౌస్ చీఫ్‌కు జరిగిన టాస్కుల్లో నిఖిల్, నైనిక, యష్మీ గౌడ గెలవడంతో వారు ఈ వారం నామినేషన్ నుంచి దూరంగా ఉంటారని తెలిపారు. దీంతో మిగతా హౌస్‌మేట్స్ మధ్య నామినేషన్ ప్రక్రియ జరిగింది.
నాగమణికంఠను నామినేట్ చేసిన హౌస్‌మేట్స్
దీనికంటెం ముందు నీల్ రావిపూడి చేసిన ప్రాంక్ వల్ల నాగమణికంఠ మిగతా హౌస్‌మేట్స్‌కు విలన్‌గా మారిపోయాడు. లక్కీ డ్రాలో ఎలిమినేట్ చేయమనడం.. ఆ పర్సన్ ఎవరో మీరే చెప్పండి అని అనడం.. వెంటనే అందరూ నాగమణికంఠ పేరు చెప్పడం, అది ప్రాంక్ అని తెలియడంలో నాగమణికంఠ చెప్పిన మాటలు అదంతా ఒక ట్రాజడీలా జరిగిపోయింది. అప్పటికే నాగమణికంఠ తనపై జరిగిన ప్రాంక్‌లో.. తన కష్టాలు చెప్పుకోవడం, అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత మామూలుగా ఉన్నప్పటికీ మిగతా సమయంలో హౌస్‌మేట్స్‌లో అదే విషయాన్ని చెప్తూ సెంటిమెంట్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆఖరికి హౌస్‌మేట్స్ నామినేట్ చేస్తుంటే తన పాపకోసం వచ్చానంటూ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ అందరూ ఎక్కువగా నాగమణికంఠను నామినేట్ చేశారు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ హాట్ బ్యూటీకే హయ్యెస్ట్!
సరైన రీజన్ కంటె పనికిమాలిన రీజన్స్
ఈ నామినేషన్ ప్రక్రియలో సరైన రీజన్ కంటె పనికిమాలిన రీజన్స్ ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ప్రతి సీజన్‌లో తొలి వారంతో పెద్దగా పరిచయాలు ఉండవు కాబట్టి.. తనతో సరిగా మాట్లాడలేదని, హాయ్, గుడ్‌నైట్ చెప్పలేదనో.. లేదా వాళ్ళు ఒక్కసైడే ఉంటున్నారనో నామినేట్ చేసేవారు. కానీ, ఈ సీజన్ తొలివారం నామినేషన్‌కు హౌస్‌మేట్స్ చెప్పిన రీజన్స్ మరీ సిల్లీగా అనిపిస్తున్నాయి. ఇక వీళ్ల రీజన్స్‌ను గమనిస్తే.. వీళ్లు అందరితో కలవట్లేదని, వాళ్లు వన్ సైడే వ్యవహరిస్తున్నారని, పనుల్లో సాయం చేయడం లేదని రీజన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రీజన్స్ కూడా ఏదో ఒకరు ఇద్దరు నుంచి వస్తే పర్వాలేదు. కానీ, అందరి నుంచి ఇవే రీజన్స్ రావడం మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఏదైమనసప్పటికీ నాగమణికంఠనే ఎక్కువమంది నామినేట్ చేశారు. ఈ రకమైన కారణాలతోనే నాగమణికంఠతోపాటు నబీల్ అఫ్రీది, బెబక్క, ప్రేరణ నామినేట్ కూడా అయ్యారు. ఇక ప్రేక్షకులు కూడా తొలి వారం పెద్దగా ఏ కారణాలు కాబట్టి హౌస్‌మేట్స్ ఇలా నామినేట్ చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి తొలివారం నామినేషన్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.