BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: మారిన మణికంఠ జాతకం.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది వాళ్లేనా?

Bigg Boss 8 Telugu: మారిన మణికంఠ జాతకం.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది వాళ్లేనా?

Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8 రెండోవారానికి చేరుకుంది. ఇక రెండోవారానికి సంబంధించిన ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడింది. దీంతో కంటెస్టెంట్స్‌లో మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో కూడా దీని మీద ఆసక్తి మొదలయ్యింది. బిగ్ బాస్ 8 మొదటివారంలో బెజవాడ బేబక్కను బయటికి పంపించేశారు ప్రేక్షకులు. అందరితో మంచి ఉంటూ, అందరికీ వండిపెట్టే బేబక్క ఎలా ఎలిమినేట్ అయ్యిందని కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. మొదటివారంలో బేబక్కతో పాటు నాగ మణికంఠ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కానీ రెండోవారానికి వచ్చేసరికి మణికంఠ జాతకమే మారిపోయింది. అత్యధిక ఓటింగ్స్ సాధించినవారి లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు.


తప్పించుకున్నాడు

బిగ్ బాస్ 8లో రెండోవారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా జరిగాయి. అందుకే రెండురోజుల పాటు ఈ నామినేషన్స్ గురించే ప్రసారం చేశారు మేకర్స్. మొదటి వారంలో జరిగిన గొడవలను గుర్తుపెట్టుకొని కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే రెండోవారంలో ఎమినిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వాళ్లే నిఖిల్, విష్ణుప్రియా, పృథ్విరాజ్, నాగ మణికంఠ, నైనికా, శేఖర్ భాషా, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత. గతవారంలో బేబక్కతో పాటు డేంజర్ జోన్‌లో ఉన్న నాగ మణికంఠ.. ఈసారి ఓట్ల విషయంలో టాప్ 3వ స్థానానికి చేరుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓట్ల విషయంలో మొదటి స్థానంలో నిఖిల్, రెండో స్థానంలో విష్ణుప్రియా ఉండగా.. మూడో స్థానం మణికంఠ సొంతం చేసుకున్నాడు.


Also Read: కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్ బాస్, పర్సనల్ లైఫ్స్ గురించి ఓపెన్ అయిన నైనికా, సోనియా.. నిజాలు బయటపడ్డాయి

టాప్ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుండి నిఖిల్‌పై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయమే ఉంది. ఒక మంచి లీడర్‌గా తన టీమ్‌ను ముందుకు నడిపించాలని అనుకున్నాడు. కానీ టీమ్‌లో ఒక సభ్యురాలు అయిన బేబక్కే తన గురించి నెగిటివ్‌గా చెప్పడం మొదలుపెట్టింది. దానివల్ల నిఖిల్‌కు ఎలాంటి నష్టం జరగలేదు కానీ బేబక్కే ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక సోనియాతో జరిగిన గొడవ విష్ణుప్రియాకు ఒక రకంగా ప్లస్సే అయ్యింది. హౌజ్‌లో అందరితో సరదాగా ఉంటూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందిస్తూ, ఎవరు ఏమన్నా కూడా సీరియస్‌గా తీసుకోకుండా ముందుకు వెళ్లిపోతుంది విష్ణుప్రియా. తనలో ఈ క్వాలిటీస్ చాలామందికి నచ్చాయి.

వారికే ఛాన్స్

ఇక డేంజర్ జోన్ విషయానికొస్తే.. ముగ్గురు కంటెస్టెంట్స్‌కు మాత్రం అతి తక్కువ ఓట్లు పడ్డాయి. వారే శేఖర్ భాషా, సీత, ఆదిత్య ఓం. హౌజ్‌లో అందరితో సరదాగా ఉంటున్నా కూడా తన ఫ్రెండ్స్ అనుకున్నవారే తనను నామినేట్ చేయడంతో శేఖర్ భాషాకు బయట ప్రేక్షకులు కూడా ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సీత కూడా అన్ని పనుల్లో యాక్టివ్‌గా ఉంటూ టాస్కులు బాగా ఆడినా కూడా తను డేంజర్ జోన్‌లో ఉండడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఆదిత్య ఓం ఇప్పుడిప్పుడే హౌజ్‌లో యాక్టివ్ అయినా కూడా తనకు తాను గ్రేట్ అనుకుంటూ చేస్తున్న ఓవరాక్షన్ చాలామందికి నచ్చలేదు. కానీ ఈసారి హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయే అవకాశాలు శేఖర్ భాషా, సీతకే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu Day 59 : దెయ్యాల వేట – రీతూ ఆట… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Big Stories

×