E-Paper
Advertisement

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు
Advertisement

Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ నడుస్తోంది. అయితే ఈ ఎనిమిదవ సీజన్లో భాగంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మూడవ వారం కూడా మొదలైంది. ఇకపోతే 18వ రోజుకు సంబంధించి తాజాగా ప్రోమో ని విడుదల చేయగా.. ఈ ప్రోమో మొదటి భయపెట్టించేసినా చివర్లో ఏడిపించేసింది. ఇకపోతే మూడవ వారంలో భాగంగా మొదటి రెండు రోజుల్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తవగా అప్పుడే టాస్కులు మొదలుపెట్టేశారు కంటెస్టెంట్స్.

చంద్రముఖిలా మారిన యష్మీ..

Advertisement

బెలూన్స్ గేమ్ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్ . ఈ గేమ్ అనంతరం యష్మీ చంద్రముఖిలా మారి అందరిని భయపెట్టేసింది. స్టిక్ విరిగిపోతే గేమ్ ఆపాలని మీకు తెలియదా అంటూ సంచాలక్ పై విరుచుకుపడింది. సంచాలక్ ఆపారా అంటూ నిఖిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రముఖి లా మారిపోయి విచక్షణారహితంగా ఎదుటివారు చెబుతున్నా.. వినకుండా నోటికొచ్చినట్టు వాగేసింది యష్మి. మీ స్టిక్ విరిగిపోతే నీ సంచాలక్ ఆపేసి మరీ కొట్టొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. అయితే నిఖిల్ మధ్యలో కలుగజేసుకొని ముందు అరవడం ఆపు.. చెప్పేది విను అంటూ ఎంత బ్రతిమిలాడినా సరే తన విశ్వరూపం చూపించేసింది యష్మి. నేను అరుస్తాను ఇలాగే అరుస్తాను ఇక్కడే అరుస్తాను అంటూ రెచ్చిపోయింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిఖిల్ పక్కకి వెళ్లి అరువు నిన్ను ఎవరు అరవద్దన్నారు.. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అంతే గట్టిగా సమాధానం ఇచ్చారు.

నిఖిల్ తో గొడవ..

Advertisement

ఆ తర్వాత గేమ్ గురించి అక్కడ గొడవ గురించి ప్రేరణతో డిస్కషన్ పెట్టింది యష్మి. సంచాలక్ అంటే మహారాణిలా నిల్చోవాలా అంటూ యాక్టింగ్ చేసి మరి రెచ్చిపోయింది యష్మి. మొత్తానికైతే హౌస్ లో ఉన్నంతసేపు యష్మి ఓవర్ యాక్టింగ్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కిచెన్ లో జరిగిన అవమానం తలుచుకొని ఎమోషనల్ అయింది విష్ణు ప్రియ. ఆకలి అని అడగడానికి వెళ్తే ముష్టి వేసినట్టు వేసింది ప్రేరణ అంటూ ఆ బాధలో మరింత ఎమోషనల్ అయింది విష్ణు ప్రియ. ఆ సమయంలో చాలామంది హౌస్ మేట్స్ ఈమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. మణికంఠ కూడా ముష్టి వేసినట్టు వేసింది అంటూ అక్కడ విల్లింగ్ నెస్ కోల్పోయారు అంటూ చెప్పుకొచ్చారు.

ఆకలి అంటూ కంటతడి పెట్టించిన విష్ణు ప్రియ..

Bigg Boss 8: Yashmi who turned like Chandramukhi.. Vishnu who cried..!
Bigg Boss 8: Yashmi who turned like Chandramukhi.. Vishnu who cried..!

దీంతో కోపం తెచ్చుకున్న ప్రేరణ నేనేమైనా ముష్టి వేశానా, విసిరేసానా అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది. దీంతో విష్ణు ప్రియ ఎమోషనల్ అవుతూ ఎవరిదైనా ఆకలే కదా.. ఆకలి అని అడిగినప్పుడు తను వేసి ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు.. మరింత బాధ కలిగించింది అంటూ ఆమె ఏడవడమే కాదు అందరిని ఏడిపించేసింది కూడా.. మొత్తానికైతే విష్ణు ప్రియని చూసి అందరూ కూడా ఎమోషనల్ అయిపోయారు.

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×