Bigg Boss 9:బిగ్ బాస్.. తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 9మంది సెలబ్రిటీలు (సంజన గల్రానీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, భరణి శంకర్, రాము రాథోడ్, తనూజ, ఫ్లోరా షైనీ, ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ) హౌస్ లోకి అడుగుపెట్టారు.
ఇంకా 6 మంది కామనర్స్ (మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్, డెమోన్ పవన్, సోల్జర్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి) ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఓనర్స్ (కామనర్స్ ), టెనెంట్స్ (సెలబ్రిటీస్) మధ్య పోరు హోరా హోరీగా సాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా మొదటి వారం కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తూ సంజన కెప్టెన్ గా ఎన్నికయింది. అదే వారం నామినేషన్ లో భాగంగా జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రెండవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ కోసం గొడవలు కూడా భారీగానే పడ్డారు. మరో మూడు రోజుల్లో రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరగబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓటింగ్ ప్రారంభం అవ్వగా తాజాగా ఇప్పటివరకు సుమన్ శెట్టి లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఓటింగ్ లిస్టులో లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరు? ఎవరు ఈసారి ఎలిమినేట్ కాబోతున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
లీస్ట్ లో వారే..
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా మనీష్, హరీష్, సుమన్ శెట్టి, ప్రియా శెట్టి, డెమోన్ పవన్, ఫ్లోరా షైనీ , భరణి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఓట్లు సుమన్ శెట్టికే పడుతున్నాయి. అటు హరీష్, ఫ్లోరా షైనీ కూడా పరవాలేదు అనిపించేలా ఓట్లు దక్కించుకుంటున్నారు. డేంజర్ జోన్ లో మనీష్, ప్రియా, పవన్ ఉన్నారు. డెమోన్ పవన్ తన గేమ్ కంటే కూడా రీతూ చుట్టూ తిరగడం పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు ప్రియా కూడా తను చెప్పిందే కరెక్ట్ అంటూ పెద్దగా వాగుతూనే ఉంది. ఇక మనీష్ విషయానికి వస్తే వరస్ట్ అని.. ఒక నిబద్ధత లేదు అని కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా ఈ ముగ్గురిలో ఒకరిని బయటకు పంపించాలని ఆడియన్స్ గట్టిగా అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఫైనల్ గా ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది వైరల్ గా మారుతున్నాయి.
also read:Bigg Boss 9: కెప్టెన్సీ వార్… ఆ లవ్లీ జంట మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్