Road accident: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భూత్పూరు మండలం కొత్తమొల్గర సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతిచెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను గట్టు కాడపల్లి గ్రామానికి చెందిన సంపల్లి వంశీ (24), హైదరాబాద్ నగరానికి చెందిన నర్సింహ రెడ్డి (57), దొంతికుంట తండకు చెందిన పాత్లవత సక్రిగా పోలీసులు గుర్తించారు.
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆటోలో భూత్పూ్రు సైడ్ వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మరి కొంత మందికి స్పల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ALSO READ: Rain News: మూడు రోజులు అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంత వాసులు బయటకు వెళ్లొద్దు.. పిడుగులు పడే అవకాశం!
ఈ ఘటనతో మృతుల కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. మృతులంతా పేద కుటుంబాలకు చెందినవారని సమాచారం. వారి మృతితో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయాయి. ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కుటుంబ సభ్యలు కోరుతున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: APSRTC Notification: ఏపీఎస్ఆర్టీసీలో 281 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు