BigTV English

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 9:ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఊహించని పరిణామాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున(Nagarjuna) మొదట్లో ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పాడు. దీనికి తోడు “డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్” అంటూ పెద్ద ఎత్తున షో పై హైప్ తీసుకొచ్చారు. అందులో భాగంగానే 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే మొదటి వారం ఊహించని విధంగా శ్రష్టి వర్మ (Shrasti varma) ఎలిమినేట్ అయ్యి.. అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది.


రెండవ వారం ఊహించని ఎలిమినేషన్..

అయితే స్పెషల్ ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన మర్యాద మనీష్(Maryada Manish) రెండవ వారం ఎలిమినేట్ అవ్వడంతో అటు ‘అగ్నిపరీక్ష’ జడ్జెస్ కూడా షాక్ అయినట్లు సమాచారం. నిజానికి అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన ఐదు మందిని హౌస్ లోకి మొదట పంపించారు. కానీ శ్రీముఖి, అభిజిత్ స్పెషల్గా మర్యాద మనీష్ ను తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరీ హౌస్ లోకి పంపించడం జరిగింది. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు రెండవ వారమే ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మర్యాద మనీష్ ఎలిమినేషన్ ఊహించనిది అని చెప్పడంలో సందేహం లేదు.

చివర్లో మారిపోయిన ఓటింగ్..


ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా.. సుమన్ శెట్టి , భరణి శంకర్, ఫ్లోరా షైనీ ఇలా ముగ్గురు సెలబ్రిటీలతో పాటు మర్యాద మనీష్ , డెమోన్ పవన్, ప్రియా శెట్టి , హరిత హరీష్ ఇలా 4 కామనర్స్.. మొత్తం 7 మంది ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు. అందులో సుమన్ శెట్టి ఓటింగ్లో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత భరణి శంకర్ , ఫ్లోరా షైనీ నిలిచారు. చివరి మూడు స్థానాలలో హరీష్, మనీష్, ప్రియా శెట్టి నిలిచారు. అయితే ఈవారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా శుక్రవారం ఆమెకు ఓటింగ్ బాగా పెరిగిపోయింది.. దీంతో మర్యాద మనీష్ ఓటింగ్ లో లీస్ట్ లోకి వచ్చేసారు.. అలా అనూహ్యంగా మర్యాద మనీష్ రెండవ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన ఎలిమినేషన్ ను హోస్ట్ నాగార్జున కన్ఫామ్ చేయబోతున్నారు.

2వారాలకు గానూ మనీష్ ఎంత అందుకున్నారంటే?

ఇకపోతే రెండు వారాలపాటు హౌస్ లో తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న మర్యాద మనీష్.. రెండు వారాలకు గానూ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే కామనర్స్ క్యాటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన మర్యాద మనీష్ వారానికి 70 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈయన రెండు వారాల పాటు హౌస్ లో ఉన్న నేపథ్యంలో రూ.1,40,000 మాత్రమే మనీష్ కి లభించినట్లు సమాచారం. మొత్తానికి అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న మర్యాద మనీష్ ఇలా రెండవ వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.

Related News

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Bigg Boss 9 : మర్యాద మనీష్ ఎలిమినేటెడ్, ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే 

Rithu Chowdary: వాళ్ల వల్లే ఆమె నన్ను వదిలేసింది.. ఇంకా విడాకులు తీసుకోలేదు.. రీతూ భర్త షాకింగ్ కామెంట్స్!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Big Stories

×