E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : నామినేషన్లను నవ్వులపాలు చేసిన సుమన్, డెమోన్… భరణి, తనూజా స్టార్ట్ చేసిన కామెడీనే

Bigg Boss 9 Telugu : నామినేషన్లను నవ్వులపాలు చేసిన సుమన్, డెమోన్… భరణి, తనూజా స్టార్ట్ చేసిన కామెడీనే
Advertisement

Bigg Boss 9 Telugu : ప్రతీ సోమవారం నామినేషన్ ప్రక్రియ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ ఆడియన్స్. ఎందుకంటే ఆరోజే హౌస్ మేట్స్ అసలు రంగు బయట పడుతుంది. ఒక్కొక్కరి కోపంతో హౌస్ షేక్ అవుతుంది. కానీ ఈరోజు నామినేషన్లు మాత్రం వింతగా జరిగాయి. కొంతమంది కంటెస్టెంట్స్ సీరియస్ నామినేషన్లు చేస్తే మరికొంత మంది మాత్రం అందరూ నవ్వుకునేలా చేశారు.

భరణి – డెమోన్ ఫన్నీ స్టోరీ 

ముందుగా భరణి సంజనాను సీరియస్ గా నామినేట్ చేశాడు. తరువాత ‘వారం 10 రోజుల నుంచి డెమోన్ డల్ గా కన్పిస్తున్నాడు. నిన్ను వెనక్కి లాగేది అంటే బాండింగ్ కాదు… అది ఇంకేదైనా పక్కన పెట్టేయ్. గత వారం అయితే వచ్చిన గెస్ట్ లు పవన్ మాట్లాడడా ? అని అడుగుతూనే ఉన్నారు” అంటూ భరణి తన పాయింట్ పెట్టాడు. “గెస్ట్ లు కోపాన్ని తగ్గించుకో అని చెబుతుంటే డల్ అయ్యాను” అని అన్నాడు డెమోన్. “నువ్వు అక్కడ ఒక్కడివే పడుకుని ఆకాశంలోకి చూస్తుంటే…  నాకైతే బాడీ నిది, ఫేస్ మాత్రం రామూది కన్పించింది” అని భరణి అనగానే డెమోన్ తో సహా అందరూ నవ్వేశారు. అయితే “బ్లూ స్కైలో నేను మూన్ ను ఆస్వాదిస్తుంటే మీరే అలా ఊహించుకున్నారు” అంటూ కవర్ చేసుకున్నాడు డెమోన్.

సుమన్ నామినేషన్స్ లో నవ్వులు 

Advertisement

సుమన్ రీతూని నామినేట్ చేయడంతో సీరియస్ డిస్కషన్ నడిచింది. ఆమెను నామినేట్ చేయడానికి ‘2 వీక్స్ నుంచి నువ్వు నామినేషన్స్ లో లేవు. అరుస్తావు” అంటూ సిల్లీ పాయింట్స్ పెట్టాడు సుమన్. ఇక డెమోన్ ను అయితే “నీకు హెల్త్ బాలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది” అనే పాయింట్ తో నామినేట్ చేశాడు. అతని నామినేషన్ నడుస్తున్నంత సేపు హౌస్ మేట్స్ నవ్వుతూనే ఉన్నారు.

తనుజా ఏకంగా నామినేషన్ ప్రాసెస్ ను మార్చేసింది. ముందు ఇమ్మూ పేరు చెప్పి, తరువాత డెమోన్ ను నామినేట్ చేసింది. అదేంటని డెమోన్ ప్రశ్నిస్తే, ఇంతెత్తున ఒంటికాలిపై లేచింది. డెమోన్ కూడా అదే పని చేశాడు. ‘నామినేషన్ లోకి వస్తే బాగుంటుంది అన్నావ్’ అంటూ ఇమ్మూని నామినేట్ చేశాడు. నేనేదో కామెడీకి అంటే నిజంగానే నామినేట్ చేస్తావా ? అని ఇమ్మూ అనడంతో పాటు, అందరూ నవ్వడంతో సంజన పేరు చెప్పాడు. ఇక సంజన గురించి చెప్పక్కర్లేదు. ‘టికెట్ టు ఫినాలే కొడతా అని అన్నావ్ అంటూ డెమోన్ ను, సారీ తీసుకోలేదు, చెప్పలేదు అంటూ రీతూని నామినేట్ చేసింది. కళ్యాణ్ కూడా తగ్గేదె లే అంటూ లాస్ట్ వీక్ టాస్క్ సరిగ్గా ఆడలేదనే సిల్లీ రీజన్ తో భరణిని నామినేట్ చేశాడు. మొత్తానికి 13వ వారం అందరూ నామినేషన్స్ ను ఫన్నీగా తీసుకున్నారు.

Advertisement

Read Also : రెచ్చిపోయిన తనూజ… అందరి టార్గెట్ రీతూ-డెమోన్… ఈ వారం మొత్తం తుప్పాస్ నామినేషన్లే

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×