E-Paper
Advertisement

OTT Movie : అడక్కుండానే అబ్బాయికి ముద్దు… అందరూ చూస్తుండగానే ఆ పని…. ఓటీటీలోకి బ్రాడ్ పిట్ రొమాంటిక్ మూవీ

OTT Movie : అడక్కుండానే అబ్బాయికి ముద్దు… అందరూ చూస్తుండగానే ఆ పని…. ఓటీటీలోకి బ్రాడ్ పిట్ రొమాంటిక్ మూవీ

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలను ఏ మాత్రం ఇంగ్లీష్ రానోళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అందులోనూ బ్రాడ్ పిట్ లాంటి స్టార్ హీరో సినిమాలను ఎగబడి చూస్తుంటారు. 1920 ల కాలంనాటి హాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఉండేదో పూస గుచ్చినట్లు చూపించిన సినిమా ‘బేబిలాన్’. బ్రాడ్ పిట్ నటించిన ఈ రొమాంటిక్ సినిమాకి థియేటర్లలో అంతగా ఆదరణ లభించకపోయినా, మూడు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం విశేషం. దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఈ రొమాంటిక్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

డెమియన్ చాజెల్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘బేబిలాన్’ 2022లో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా డిసెంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ ఇదివరకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్దతిలో అందుబాటులో ఉంది. ఇందులో బ్రాడ్ పిట్, మార్గాట్ రాబీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో బ్రాడ్ పిట్ ని అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టుకుని వార్తల్లో నిలిచింది మార్గాట్. అసలు సినిమాలో ఆ సీన్ లేక పోయినా, అతని మీద ఇష్టంతో అలా చేశానని ఆ తరువాత చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

Read Also : ముసలి సర్పంచ్ తో యంగ్ అమ్మాయి సరసాలు… ఆ అందం వెనుక అపాయం కూడా… ‘అంజలీ’ ఇలాంటి సిరీస్ లోనా ?

స్టోరీ ఏమిటంటే

అది 1926 కాలం నాటి లాస్ ఏంజెల్స్ లో మూకీ సినిమాలు, టాకీలుగా మారుతున్న సమయం. ఒక రాత్రి పెద్ద డాన్ ఇంట్లో జరిగే వైల్డ్ పార్టీతో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ డ్రగ్స్, డ్యాన్స్, మత్తుతో ఫుల్ చిల్ చేస్తుంటారు. అందులోనే మెక్సికన్ అబ్బాయి మానీ (డియేగో కాల్వా), నెల్లీ లారాయ్ (మార్గాట్ రాబీ), సూపర్‌ స్టార్ జాక్ కాన్రాడ్ (బ్రాడ్ పిట్) లైఫ్‌లు కలుస్తాయి. ఒక్క రాత్రిలోనే నెల్లీ స్టార్ అవుతుంది. మానీ ఆమె అసిస్టెంట్ అవుతాడు. జాక్ తన స్టార్ ఇమేజ్ తో ఆనందిస్తాడు. హాలీవుడ్ స్వర్గంలా కనిపిస్తుంది. అయితే 1929లో టాకీస్ (సౌండ్ ఫిల్మ్స్) వచ్చేస్తాయి. ఆ సమయంలో వీళ్ళ జీవితాలు తలకిందులు అవుతాయి. నెల్లీ డ్రగ్స్-జూదంలో పడి కెరీర్ నాశనం చేసుకుంటుంది. జాక్ సౌండ్ ఫిల్మ్స్‌లో ఫెయిల్ అయి, డిప్రెస్డ్ తో సూసైడ్ చేసుకుంటాడు. మానీ ఒక్కడే కొంచెం పైకి వెళ్తాడు కానీ హాలీవుడ్ ని ఒక భయంకరమైన భూతంగా భావిస్తాడు.

 

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×