BigTV English

Bigg Boss 9 Telugu Day 2: బ్యాక్ బిచ్చింగ్ లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్, నామినేషన్ లో టార్గెటైన ‘బుజ్జిగాడు‘ భామ

Bigg Boss 9 Telugu Day 2: బ్యాక్ బిచ్చింగ్ లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్, నామినేషన్ లో టార్గెటైన ‘బుజ్జిగాడు‘ భామ

Bigg Boss 9 Telugu Day 2 Episode: బిగ్ బాస్ లో ఆసక్తికర అంశమంటే నామినేషన్ ప్రక్రియ. అప్పటి వరకు హౌజ్ లో మాస్క్ తో ఉన్నవాళ్లంతా ఇక్కడే అసలు రూపం బయటపడుతుంది. అప్పటి వరకు కూల్ గా, నవ్వుతూ మాట్లాడుకున్న కంటెస్టెంట్స్ కి ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయం ఉందో నామినేషన్ లో బయటకు వస్తుంది. ఇక నామినేషన్ మొదటి ఘట్టంలో హౌజ్ ఓనర్స్ అంత ఒక్క నిర్ణయంపై టెనెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయాలని.


ఏకగ్రీవంగా సంజన నామినేషన్

ఇందులో భాగంగా హౌజ్ ఓనర్స్(కామనర్స్) అంత యునానమస్ గా టెనెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. దీంతో హౌజ్ ఓనర్స్(కామనర్స్) సంజనను ఎంచుకుని నామినేట్ చేశారు. హౌజ్ లో తన యాటిట్యూడ్ వల్లే ఆమెను నామినేట్ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో దమ్ము శ్రీజ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావనగానే.. సంజన్ ఫైర్ అయ్యింది. మర్యాదగా మాట్లాడు.. మా ఇండస్ట్రీలో బ్యాక్ బిచ్చింగ్ వర్డ్ వాడరు.. అంటూ డిఫెండ్ చేసుకుంది. బ్యాక్ బిచ్చింగ్ పదంపై ఆమె నానా రచ్చ చేసింది. ఈ విషయంలో తనని పాయింట్ అవుట్ చేస్తున్నారంటూ.. నన్ను బ్యాక్ బిచ్చింగ్ అంటావా? అంటూ ఈ పదంపై రద్దాం చేసింది. ఇదంత చూస్తుంటే ఆమె కావాలనే గొడవ పడాలని చూస్తుందని అర్థమవుతుంది. అంతేకాదు తన నుంచి నెగిటివ్ వైబ్ వస్తుందని అనడంతో ఆ పదంపై నానా రచ్చ చేసింది. ఫైనల్ బ్యాక్ బిచ్చింగ్, నెగిటివ్ వైబ్ అనేది ఏదో బూతు పదంలా సంజనా షో ఆఫ్ చేసింది. ఇది హౌజ్ లో ప్రతి ఒక్కరిని ఇరిటేట్ చేసింది.

షాంపు గొడవ.. వెక్కెక్కి ఏడ్చిన ఫ్లోరా

ఇక బాత్ రూంలో షాంపూ విషయంలో సంజనా చేసిన రచ్చ అంత ఇంత కాదు. హౌజ్ అంత కలిసి ఆమెకు చెప్పే ప్రయత్నం చేసిన అస్సలు తగ్గను అన్నట్టుగా వ్యవహరించింది. ఈ విషయంలో ఫ్లోరా సైనీ, సంజన మధ్య వాగ్వాదం జరిగింది. షాంపూని తను బాత్ రూంలో పెట్టొద్దని చెప్పిన సంజన వినలేదు. షాంపూ విషయంలో వాదించుకుంటుండగా.. నేను నీ సర్వెంట్ కాదు.. అంటూ ఫ్లోరా.. ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాగ్వాదంలో ఆమె ఫ్లోరా ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత రితూ చౌదరి, శ్రేష్టి వర్మ, భరణి, అంత ఆమెను ఓదార్చడంతో ఫ్లోరా నార్మల్ అయ్యింది. షాంపూని బయట పెట్టాలని, బాత్ రూం పెట్టొద్దని హౌజ్ అంత చెప్పిన సంజన వినలేదు. ఈ విషయంంలో హౌజ్ మేట్స్ తో ఆమె పెద్ద యుద్దమే చేసింది. ఆమె ఎంతకి తగ్గకపొవడంతో బాత్ రూం ఏరియా లీడ్ గా ఉన్న సోల్జర్ పవన్ కళ్యాణ్.. మిగతా వారికి కూడా నిబంధనలు విధించాల్సి వచ్చింది. ఆఖరికి మాస్క్ మ్యాన్ హరీష్ నెమ్మదిగా, ప్రేమగా చెప్పడంతో సంజనా దిగి వచ్చింది. ఇలా ప్రేమగా చెప్పారు కదా వింటాను అంటూ కూల్ అయ్యింది. మొత్తానికి హౌజ్ లో సంజనా ఫైర్ బ్రాండ్ లా ప్రతి విషయంలో పేలుతోంది. ఇది హౌజ్ లో ఆమెకు ఫుల్ నెగిటివిటీ వస్తోంది.


నామినేషన్ ప్రక్రియ..

ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. నామినేషన్ ప్రక్రియంలో బిగ్ బాస్ హౌజ్ ఓనర్స్ కి వెసులుబాటు ఇచ్చాడు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో కేవలం టెనెంట్స్ మాత్రమే పాల్గొంటారని స్పష్టం చేశారు. ఓనర్స్ నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించాలని చెప్పారు. టెనెంట్స్ నుంచి(సెలబ్రిటీలు) ఇద్దరు పోటీదారులు.. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టన్నెల్స్ నుంచి వెళ్లి అక్కడ పోడియంపై పెట్టిన సుత్తిని తీసుకోవడానికి పోటీ పడాలి. సుత్తి తీసుకున్న పోటీ దారుడు ఓడిన పోటీ దారుడిని ఫోటోని పగలగోట్టి.. టెనెంట్స్ నుంచి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. ఆ తర్వాత హౌజ్ ఓనర్స్ లో ఒకరికి సుత్తి ని ఇచ్చిన పోటీ దారుడు చెప్పిన కారణాలు సరైనవా, కావా అని జడ్జీ చేయాలి. ఒకవేళ వారి కారణలు సరైనవి కాకపోతే..ఆ నామినేషన్ ని రద్దు చేసి.. టెనెంట్స్ నుంచి మరోకరిని నామినేట్ చేయాలి. ఇక సుత్తి తీసుకున్న హౌజ్ ఓనర్స్ సేఫ్ జోన్ ఉంటారని, అది దక్కలేని వారు డేంజర్ జోన్ లో ఉంటారని హెచ్చరించారు బిగ్ బాస్.

ఎవరూ ఎవరిని నామినేట్ చేశారంటే..

తనూజ, రితూ చౌదరి పోటీ

ఇక సుత్తి కోసం రీతూ చౌదరి, తనూజలు పోటీ పడ్డారు. అయితే పోటీలో రీతూ చౌదరి చేతికి గాయం అవ్వడంతో బిగ్ బాస్ ఆమెను మెడికల్ రూంకి పిలిచాడు. ఆ తర్వాత పోటీలో గెలిచిన తనూజ సంజనను నామినేట్ చేసి తన వివరణ ఇచ్చింది. ఇక ఈ సుత్తిన తనూజ ఓనర్స్ లో కళ్యాణ్ కి ఇచ్చింది. అతను కూడా తనూజ నిర్ణయాన్ని సపోర్టు చేసి సంజనను నామినేట్ చేశాడు.

రామ్ రాథోడ్, శ్రేష్టి వర్మ

సెకండ్ పోటీ దారులుగా సుత్తి కోసం రామ్ రాథోడ్, శ్రేష్టిలు వెళ్లగా.. రామ్ రాథోడ్ గెలిచాడు. నామినేషన్ చాన్స్ కొట్టేసిన రామ్.. సుమన్ శెట్టిని నామినేట్ చేసి వివరించారు. తన నామినేషన్ డిసైడ్ చేసేందుకు హౌజ్ ఓనర్స్ లో మాస్క్ మ్యాన్ కి సుత్తి ఇవ్వగా.. అతను కూడా రామ్ రాథోడ్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఇద్దరు కూడా సుమన్ శెట్టి హౌజ్ లో ఎవరితో కలవట్లేదు అనే రిజన్ చెప్పి నామినేట్ చేశారు. దానికి సుమన్ శెట్టి వివరణ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత హరీశ్, కళ్యాణ్ కు టెనెంట్స్ లో మిగిలిన నలుగురిలో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. వారిద్దరు కలిసి చర్చించి.. భరణి, ఇమ్మాన్యుయేల్ లను నెక్ట్స్ పోటీ దారులుగా ఎంపిక చేశారు. దీంతో నేటి ఎపిసోడ్ పూర్తయ్యింది. రేపు మిగిలిన నామినేషన్ చూడోచ్చు.

Related News

Bigg Boss season 9 Day 2: షాంపూ కోసమో సబ్బు కోసమో, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సెలబ్రిటీల నుంచే.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!

Bigg Boss 9 Telugu: సంజనా మొండితనం.. దెబ్బకు లేడీ కంటెస్టెంట్స్ కి షాక్!

Bigg Boss 9 Telugu Day 2: బ్రేకింగ్.. హౌజ్ లో రితూ చౌదరికి తీవ్ర గాయాలు.. బయటకు రాక తప్పదా?

Bigg Boss 9 Remuneration : సెలబ్రిటీస్, కామనర్స్, హోస్ట్… ఒక్కొక్కరికి వారానికి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

×