SA20 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament) తరహా లోనే దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ టి20 క్రికెట్ లీగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సన్రైజర్స్ లాంటి జట్లు కూడా తలపడుతున్నాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ టి20 క్రికెట్ లీగ్ (South African Premier T20 Cricket League)…. టోర్నమెంట్ కు సంబంధించిన మెగా యాక్షన్ ఇవ్వాలా నిర్వహించారు. ఈ సందర్భంగా.. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, కెప్టెన్ తెంబా బవుమాకు ( Temba Bavuma) ఘోర అవమానం జరిగింది. ఈ టోర్నమెంట్ లో తెంబా బవుమా బహుమానం ఎవరు కొనుగోలు చేయలేదు. దీంతో సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ టి20 క్రికెట్ లీగ్ లో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు.
అటు 40 సంవత్సరాలు దాటినా కూడా టి20 లీగుల్లో ఆడేందుకు.. ఆసక్తి చూపిస్తున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ( James Anderson ) కూడా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం ఇటీవల జరగగా అక్కడ కూడా అండర్సన్ కు అవమానమే ఎదురైంది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కూడా అదే అవమానాన్ని చవిచూశాడు అండర్సన్.
కెప్టెన్ తెంబా బవుమాకు ( Temba Bavuma) ఘోర అవమానం
సౌత్ ఆఫ్రికా జట్టును నడిపిస్తున్న తెంబా బవుమారే దారుణమైన అవమానం జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ను గెలిపించి ఛాంపియన్గా నిలిపిన… తెంబా బవుమాను సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో ఎవరు కొనుగోలు చేయలేదు. టి20 లీగ్ లో…తెంబా బవుమా పనికిరాదని పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ…. జట్ల ఓనర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో సౌత్ ఆఫ్రికా సారధి తెంబా బవుమా అన్ సోల్డ్ ప్రేయర్ గా మిగిలిపోయారు. అతనితోపాటు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ( James Anderson ) కూడా… తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతన్ని ( James Anderson ) కూడా ఎవరు కొనుగోలు చేయలేదు.
బ్రేవిస్ కు అదిరిపోయే ఆఫర్
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు బ్రేవిస్ ( Brevis) ఈ సౌత్ ఆఫ్రికా t20 టోర్నమెంట్ లో జాక్పాట్ కొట్టాడు. సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో అతన్ని ప్రిటోరియా క్యాపిటల్స్ ( Pretoria Capitals ) జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా 8.30 కోట్లకు అతన్ని దక్కించుకుంది ప్రిటోరియా క్యాపిటల్స్. టోర్నమెంట్లో ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. రిషబ్ పంత్ తరహాలోనే ఇతన్ని కూడా కొనుగోలు చేశారు.
Also Read: Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి