E-Paper
Advertisement

Air Plane Engine Off: ఆకాశంలో విమానం ఇంజిన్లు షట్ ఆఫ్.. మ్యాజిక్ పుట్టగొడుగుల ఎఫెక్ట్ తో పైలెట్ పిచ్చిపని

Air Plane Engine Off: ఆకాశంలో విమానం ఇంజిన్లు షట్ ఆఫ్.. మ్యాజిక్ పుట్టగొడుగుల ఎఫెక్ట్ తో పైలెట్ పిచ్చిపని
Advertisement

Air Plane Engine Off: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఓ పైలట్ నడి ఆకాశంలో విమానం ఇంజిన్లు షట్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. 83 ప్రయాణికులు, సిబ్బందితో సీటెల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానాన్ని జోసెఫ్ ఎమర్సన్ అనే పైలట్ క్రాష్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. జోసెఫ్ ఎమర్సన్ సీలింగ్ ప్యానెల్‌లోని రెండు అత్యవసర ఇంజిన్ షట్-ఆఫ్ హ్యాండిల్స్ లాగేందుకు ప్రయత్నించాడు.

విమానం ఇంజిన్ షట్ డౌన్

ఈ సంఘటన 2023 అక్టోబర్ లో అలాస్కా అనుబంధ సంస్థ హారిజన్ ఎయిర్ నిర్వహించే ఎంబ్రేయర్ E75 జెట్‌లో చోటుచేసుకుంది. ఈ విమానం కాక్‌పిట్ ఆడియో ఇటీవల వైరల్ అయింది. పైలట్ ఎమర్సన్ విమానం ఇంజిన్‌ను షట్ డౌన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆడియో రికార్డైంది. ఈ ఆడియోలో విధుల్లో ఉన్న పైలట్ ఎమర్సన్ తాను ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత కో పైలట్ ఏం జరిగిందని అడుగుతున్నట్లు వినిపించింది.

ఇంజిన్లు ఆపే ప్రయత్నం

Advertisement

“డ్యూడ్, ఏం జరుగుతోంది?” అని కోపైలట్ అడుగుతుండగా అసభ్యకరమైన శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే “హారిజోన్, మనం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలి” అని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు చెప్పాడు. “ఇంజిన్లను ఆపివేయడానికి ప్రయత్నించారు. మనం ఇప్పుడు నేరుగా పోర్ట్‌ల్యాండ్‌కు వెళ్లాలి” అని కో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు తెలిపాడు.

మ్యాజిక్ పుట్టగొడుగుల ప్రభావం

ఈ ఘటనపై పైలట్ ఎమర్సన్ ప్రవర్తిస్తూ.. రెండు రోజుల క్రితం తాను తిన్న “మ్యాజిక్ పుట్టగొడుగులు” ప్రభావంతో తాను అలా ప్రవర్తించానని ఎమర్సన్ అధికారులకు చెప్పాడు. విమానం పోర్ట్‌ల్యాండ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత, ఎమర్సన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి చేతికి సంకెళ్లు వేసి విమానం నుండి బయటకు వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

Advertisement

Also Read: MGNREGA Days Hike: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. పనిదినాలు పెంచిన కేంద్రం

‘ఆఫ్-డ్యూటీ’ పైలట్ కాక్‌పిట్‌లో ఎలా?

ఎమర్సన్ కాక్‌పిట్ లాగిన హ్యాండిల్స్.. విమానంలో మంటలు సంభవించినప్పుడు ఇంధనాన్ని నిలిపివేయడానికి ఉపయోగిస్తారు.
ఎమర్సన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తాను కల లాంటి స్థితిలో ఉండి హ్యాండిల్స్‌ను లాగినట్లు చెప్పాడు. అవి తన జీవితంలో అత్యంత తీవ్రమైన మూడు సెకన్లు అని అతను చెప్పాడు. విమాన సిబ్బంది తనను అడ్డుకున్నారని ఎమర్సన్ ఒప్పుడుకున్నాడు. 83 మందిని ప్రమాదంలో పడేసినందుకు అతడు అభియోగాలు ఎదుర్కొన్నాడు. అతనికి 46 రోజులు జైలు శిక్ష విధించారు. అలాగే మూడు సంవత్సరాలు పర్యవేక్షణలో ఉండాలని కోర్టు ఆదేశించింది.

 

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×