E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనూజాపై డెమోన్ మ్యాన్ హ్యాండ్లింగ్… ముట్టుకుంటే గోల… మరి నువ్వు చేసిందేంటి పాపా?

Bigg Boss 9 Telugu : తనూజాపై డెమోన్ మ్యాన్ హ్యాండ్లింగ్… ముట్టుకుంటే గోల… మరి నువ్వు చేసిందేంటి పాపా?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్యాన్స్ బేస్ తో టాప్ లో దూసుకెళ్తున్న కంటెస్టెంట్స్ లో తనూజా ఒకరు. సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు సీజన్ 9లోకి అడుగు పెట్టి, టాప్ 5లో ఒక కంటెస్టెంట్ గా మారింది. కానీ ఆమెపై బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ వేరే లెవెల్ లో నెగిటివిటీ ఉంది. అది చాలదన్నట్టు లాజిక్ లెస్ గొడవలతో చేతులారా ఆ నెగెటివిటిని చేతులారా పెంచుకుంటోంది తనూజా. తాజాగా డెమోన్ పై అనవసరంగా గొడవ పడి, ట్రోలింగ్ స్టఫ్ గా మారింది.

గేమ్ లో ఏం జరిగింది ?

రీసెంట్ ఎపిసోడ్స్ చూస్తుంటే తనూజా డెమోన్ ను చిన్నచూపు చూస్తున్నట్టు క్లియర్ గా అర్థం అవుతోంది. నిన్నటికి నిన్న టాస్క్ లో తోసేసి ఫౌల్ గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. ఇక ఈరోజు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ పెద్ద పెద్ద వర్డ్స్ వాడి, డెమోన్ ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అందరూ నామినేషన్లలో ఉండడంతో ఇమ్యూనిటీ, అలాగే కెప్టెన్సీ కోసం కింగ్ క్వీన్స్ – కమాండర్లు – ప్రజలు అనే టాస్క్ నడుస్తోంది. అందులో భాగంగా రాణులు రీతూ, దివ్య కమాండర్లు డెమోన్, నిఖిల్ లను మరో కమాండర్ అయిన తనూజాను ఎత్తి టేబుల్ పై కూర్చోబెట్టమన్నారు. వాళ్ళు ఆమెను పట్టుకోబోయేలోపే తనూజా గోల గోల చేసింది. ‘అమ్మాయిని అబ్బాయిలా హ్యాండిల్ చేస్తారేంటి ? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. నాకు నచ్చలేదు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘నీకు నచ్చలేదు సరే. వాళ్ళు కూడా నిన్నేమీ ముట్టలేదు” అంటూ దివ్య క్లారిటీ ఇచ్చింది. అలాగే డెమోన్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా పట్టించుకోకుండా అక్కడ వాదన పెట్టుకుంది తనూజా. అనవసరంగా డెమోన్ ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేసింది అంటూ ఈ ఎపిసోడ్ చూసిన అతని అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు డెమోన్ చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే నిన్నటి టాస్క్ లో నువ్వు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్లోనూ ఇదే తీరు 

Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో కమాండర్లు నిఖిల్, సంజన, తనూజా, డెమోన్ బాల్ అండ్ బాస్కెట్ టాస్క్ ఆడిన సంగతి తెలిసిందే. ఇందులోనూ తనూజా డెమోన్ ను బ్లూ లైన్ బయటకు నెట్టేసింది. అలాగే అతను కింద పడితే ఫౌల్ గేమ్ అంటూ డెమోన్ ను గేమ్ నుంచి బయటకు పంపడానికి గట్టిగానే ట్రై చేసింది. అంతేకాదు టాస్క్ జరుగుతున్నంతసేపూ డెమోన్ ను ఏదో ఒకటి అంటూనే ఉంది. అదే తనూజాకు ఇలా జరిగి ఉంటే కథ వేరేలా ఉండేది. ఆమె చేస్తే స్ట్రాటజీ, వేరే వాళ్ళు ఆడితే రజాక్ అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది తనూజ. ఇదే తీరు కొనసాగితే ఆమె స్థానం టాప్ 1 నుంచి పడిపోయే ఛాన్స్ లేకపోలేదు.

Read Also : దివ్యకు రీతూ మాస్ వార్నింగ్… రాణితో ఇమ్మూ ఫ్లర్టింగ్ … బాహుబలి రేంజ్ పనిష్మెంట్ ఇచ్చిన కళ్యాణ్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×