Bigg Boss 9 Telugu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరొకసారి వచ్చేసింది. సెప్టెంబర్ 7 సాయంత్రం 7:00కు స్టార్ మా వేదికగా అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. 9 మంది సెలబ్రిటీలతో 6 మంది కామనర్స్ తో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రెండు హౌస్ లు.. చూసే ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెయిన్ హౌస్ లో కామనర్స్ ఉండబోతున్నారు.. అంటే వీరే బిగ్ బాస్ హౌస్ కి ఓనర్స్. ఇక టెంట్ హౌస్ లో సెలబ్రిటీలకు అవకాశం కల్పించారు. కామనర్స్ కి ఈ రేంజ్ లో స్టేటస్ ఇవ్వడానికి కారణం అగ్నిపరీక్షలో వారి సత్తా చూసిన తర్వాతనే వారే మెయిన్ కర్తలుగా బిగ్బాస్ నిర్ణయించారట.
అలా అగ్నిపరీక్ష నుండి 13 మంది సెలెక్ట్ కాగా.. వారిలో ముగ్గురిని ఆడియన్స్ ఓట్ల ద్వారా ఎంపిక చేయగా.. మరో ఇద్దరిని జడ్జెస్ ఎంపిక చేశారు. ఇక చివరిలో మనీష్ మర్యాదను శ్రీముఖి స్పెషల్ గా వచ్చి మరీ హౌస్ లోకి పంపించింది. అలా శ్రీజా దమ్ము , ప్రియా శెట్టి, సోల్జర్ కళ్యాణ్, డిమోన్ పవన్, మాస్క్ మాన్ హరీష్ , మర్యాద మనీష్ ఇలా మొత్తం 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. ముద్దమందారం సీరియల్ తో భారీ పాపులారిటీ అందుకున్న సీరియల్ యాక్టర్స్ తనూజ మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఫ్లోరా షైనీ, ఇమ్మానుయేల్, సంజనా గర్లాని, రాము రాథోడ్, భరణి, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, శ్రేష్ఠి వర్మ హౌస్ లోకి అడుగుపెట్టారు.
ALSO READ:Kamal Haasan: రూమర్స్ కి ఆజ్యం పోసిన కమలహాసన్.. రజనీకాంత్ తో అది నిజమే అంటూ!
భరణి శంకర్ కి మద్దతుగా నాగబాబు..
ఇకపోతే నాగబాబు ఫ్రెండ్ స్రవంతి సీరియల్ తో పాటు మరికొన్ని సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న భరణికి ఇప్పుడు నాగబాబు మద్దతుగా నిలిచారు..భరణి హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఇక్కడ నాగబాబు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే స్పెషల్ విషెస్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. “నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపును తీసుకురావాలి అని కోరుకుంటున్నాను” అంటూ నాగబాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
నాగబాబు పోస్ట్ తో జనసైనికుల ఓట్లు పడతాయా?
ఇకపోతే నాగబాబు పోస్ట్ పై కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భరణి శంకర్ కి శుభాకాంక్షలు చెబుతూ అతడిని సపోర్టు చేయాలని జనసైనికులను ఇన్ డైరెక్ట్ గా సిద్ధం చేస్తున్నారు చేస్తున్నారు.. జనసైనికుల ఓట్లు పడితే భరణీశంకర్ కచ్చితంగా టైటిల్ అందుకుంటాడనే ఆలోచనతో నాగబాబు ఇలా చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా తన ఫ్రెండ్ కోసం జనసైనికులను నాగబాబు వాడుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు హౌస్ లో టాస్కులు ఇస్తే..ఇక్కడ జనసైనికులకు మాత్రం భరణి శంకర్ కి ఓట్లు వేసి గెలిపించాలని నాగబాబు టాస్క్ ఇస్తున్నారంటూ కౌంటర్లు వేస్తూ ఉండడం గమనార్హం.