BigTV English

Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు

Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు

Pongal 2026: సంక్రాంతి.. తెలుగువారికి ఎంత పెద్ద పండగో చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోజు ఉండే హంగామా అంత అయింతా కాదు. ఆ మూడురోజులు బంధువులతో ప్రతి కుటుంబం ఆనందంగా గడుపుతుంది. ఇక సంక్రాంతి అంటే.. ఒకపక్క కోడి పందాలు ఉండాలి.. ఇంకోపక్క కొత్త సినిమాలు ఉండాలి. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఆ మూడు రోజుల పై కన్ను వేస్తుంది. సంక్రాంతికి తమ సినిమాను దింపాలని చూస్తూ ఉంటుంది.


ప్రతి సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు.. ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవ్వడం ఖాయం. కానీ, సంక్రాంతి 2026 మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు పొంగల్ రేసులోకి దిగుతున్నాయి. ఇంకా సంక్రాంతికి కన్ఫర్మ్ కానీ సినిమాలు కూడా  ఉన్నాయి.

ఇప్పటికీ సంక్రాంతి 2026 కి బరిలో దిగిన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్, ప్రభాస్ – మారుతీ కాంబోలో వస్తున్న ది రాజాసాబ్,  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్, కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు. ఈ నాలుగు సినిమాలను మేకర్స్ అధికారికంగా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు.


ఇక ఇవి కాకుండా మరో రెండు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఇక ఇది కాకుండా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం అనార్కలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉందని సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారిక రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

సీనియర్ హీరోలతోపాటు కుర్ర హీరో శర్వానంద్ కూడా సంక్రాంతిపైనే కన్నేశాడు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న చిత్రాల్లో నారీ నారీ నడుమ మురారీ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వా సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగుతుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు. మరి ఇన్ని సినిమాలు సంక్రాంతికే అంటే థియేటర్లు ఎలా మ్యానేజ్ చేస్తారు.. ఎంత పోటీ ఉంటుంది.. అనేది చూడాలి.

Related News

OG Movie: ‘ఓజీ’ కోసం రంగంలోకి 117 మంది సంగీత కళాకారులు.. తమన్‌ క్రేజీ అప్‌డేట్‌

Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. మొన్న కాలు.. నిన్న స్కూటీ.. నేడు ఇల్లు..!

Navya Nair: ఎయిర్ పోర్ట్ లో నటికి చేదు అనుభవం.. మల్లెపూలు తీసుకెళ్లిందని లక్ష జరిమానా

Abhinav Kashyap: సల్మాన్ ఖాన్ ఒక గుండా.. అసభ్యకరమైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Boney Kapoor: నన్ను శ్రీదేవి రూంలోకి రానివ్వలేదు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బోనీ కపూర్!

Sreeleela: విజయ్ – రష్మిక లా మారిన శ్రీలీల- కార్తీక్ ఆర్యన్

Big Stories

×