BigTV English

US State Department BJP: ఇండియాలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర.. బిజేపీ ఆరోపణలు

US State Department BJP: ఇండియాలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర.. బిజేపీ ఆరోపణలు

US State Department BJP| అగ్రరాజ్యం అమెరికా భారత దేశంలోని మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వంలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న బిజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేయడానికి ఇండియాలోని కొందరూ జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పన్నాగం పన్నుతోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర శుక్రవారం (డిసెంబర్ 7, 2024) రాత్రి ఒక మీడియా సమావేశంలో అన్నారు.


భారతదేశంలో నెక్సస్

సమావేశంలో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ” భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ మాత్రం ఆధారాలు లేకుండా కుట్రపూరిత నివేదిక ప్రచురించడం, ఏదో జరిగిపోయిందని అవినీతి ఆరోపణలు చేయడం.. ఇదంతా యుఎస్ డీప్ స్టేట్ (అమెరికా ప్రభుత్వం)తో కుమ్మకై రాహుల్ గాంధీ, ఒక వర్గానికి చెందిన విలేకరులు అందరూ కలిసి ఒక నెక్సస్ (సిండికేట్)గా ఏర్పడి చేస్తున్నారు.


అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసేవిధంగా ఒసిసిఆర్‌పి (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ – ప్రపంచదేశాలకు చెందిన ప్రభుత్వాలు చేసే నేరాలను బహిర్గతం చేసే సంస్థ) కొన్ని రిపోర్టులు జారీ చేసింది. వీటని రాహుల్ గాంధీ చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదానీతో మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చూపిస్తూ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారు. అన్నీ ఆధారాలు లేని ఆరోపణలే.

Also Read: రాజ్యసభలో ఎంపీ సీటు కింద నోట్ల కట్ట లభ్యం.. పార్లమెంటులో దుమారం..

అసలు ఒసిసిఆర్‌పి నిధులు ఎవరు ఇస్తున్నారో తెలుసా?. అమెరికా ప్రభుత్వానికి చెందిన యుఎస్ ఏజెన్సి ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, జార్జి సోరోస్ లాంటి కుట్రదారులు. ఈ నిజాన్ని బయటపెట్టింది ఒక ఫ్రెంచ్ మీడియా సంస్థ. భారత ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా ఏజెండాకు ఒసిసిఆర్‌పి ఆయుధంగా పనిచేస్తోంది. ఆ ఒసిసిఆర్‌పి ఇచ్చే నివేదికలు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. వీరందరి టార్గెట్ ప్రధాన మంత్రి మోడీనే. ఒసిసిఆర్‌పి వచ్చే నిధుల్లో 50 శాతం అమెరికా నుంచే వస్తున్నాయని ఫ్రెంచ్ ఇన్వెస్టిగేటివ్ మీడియా గ్రూప్ బయట పెట్టింది.

దేశంలో అతిపెద్ద దేశద్రోహి రాహుల్ గాంధీ. అమెరికా ప్రభుత్వం, బిలియనీర్ జార్జి సోరోస్, (Geroge Soros) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ముగ్గరూ దుష్ట త్రికోణంగా ఏర్పడి భారత దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు.” అని అన్నారు.

సంబిత్ పాత్రా చేసిన ఆరోపణలను బిజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్లెమెంట్ లో రిపీట్ చేశారు. ప్రధాన మంత్రి మోడీకి వ్యతిరేకంగా విద్వేషాలను ప్రచారం చేయడానికి విదేశీ ప్రభుత్వాలు, బిలియనీర్ వ్యాపారవేత్తలో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

‘దేశాలలో ప్రభుత్వాలను కూల్చేందుకు అక్కడి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు చేసే జార్జి సోరోస్ లాంటి బిజినెస్ టైకూన్ తో రాహుల్ గాంధీ మీటింగ్లు చేస్తున్నారు. ఇల్హాన్ ఒమర్ లాంటి అమెరికా పీలు ప్రధాన మంత్రి మోడీ, ఆయన పరిపాలపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అలాంటివారితో విదేశాల్లో రాహుల్ గాంధీ సమావేశమవుతున్నారు. దీనిపై విచారణ జరగాల్సిందే”, అని అన్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×