EPAPER

Bigg Boss 8 Telugu: శేఖర్ భాషా అవుట్.. కలిసికట్టుగా గెంటేసిన హౌజ్‌మేట్స్, వెళ్లేముందు వారికి ఫేక్ సర్టిఫికెట్

Bigg Boss 8 Telugu: శేఖర్ భాషా అవుట్.. కలిసికట్టుగా గెంటేసిన హౌజ్‌మేట్స్, వెళ్లేముందు వారికి ఫేక్ సర్టిఫికెట్

Bigg Boss 8 Telugu Elimination: కుళ్లు జోకులు వేస్తూ, అందరినీ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే శేఖర్ భాషా బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిపోయాడు. కానీ ప్రతీసారిలాగా కాకుండా ఈసారి ఎలిమినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా జరిగాయి. ఈసారి హౌజ్‌మేట్స్ అందరూ డేంజర్ జోన్‌లో ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ భాషా ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. దీంతో చాలామంది ఆదిత్య ఓం హౌజ్‌లో ఉంటే బాగుంటుందని తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. సీత తప్పా మరెవరు శేఖర్ భాషా హౌజ్‌లో ఉండాలని కోరుకోలేదు. దీంతో శేఖర్ భాషా బయటికి వెళ్లక తప్పలేదు.


యాక్టివ్‌గా లేడు

మొదటి వారంలో ఉన్నంత యాక్టివ్‌గా రెండో వారంలో శేఖర్ భాషా లేడని దాదాపుగా అందరు హౌజ్‌మేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆదిత్య ఓం గురించి మంచి మాటలు చెప్పారు. ఆదిత్య ఓం ఎప్పుడూ అన్ని రూల్స్‌ను ఫాలో అవుతాడని, గెలవాలనే కసితో ఉంటాడని, అందుకే తనకు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండే అర్హత ఉందని కలిసికట్టుగా హౌజ్‌మేట్స్ అంతా చెప్పారు. ఇక శేఖర్ భాషాకు కొడుకు పుట్టాడని తనను బయటికి పంపడం లేదని.. కానీ అదే కారణం వల్ల తను చాలా డిస్టర్బ్‌గా ఉంటున్నాడని అన్నారు. అలా డేంజర్ జోన్‌లో ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ భాషాలో శేఖర్ భాషానే బయటికి పంపాలని హౌజ్‌మేట్స్ నిర్ణయించారు.


Also Read: అభయ్‌కు సోనియా వెన్నుపోటు, నిఖిలే కావాలంటూ రూట్ ఛేంజ్.. తనకు బ్రెయిన్ లేదని ఒప్పుకున్న విష్ణుప్రియా

సొంత చెల్లి

బిగ్ బాస్ హౌజ్ నుండి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత ఎవరు రియల్ అనిపిస్తారు, ఎవరు ఫేక్ అనిపిస్తారు చెప్పమని శేఖర్ భాషాకు చెప్పారు నాగార్జున. ముందుగా హౌజ్‌లో తనకు రియల్ అనిపించే కంటెస్టెంట్స్ గురించి చెప్పాడు. సీత పేరు చెప్పి తనకు సొంత చెల్లి లేకపోయినా.. సీత మాట్లాడుతుంటే చెల్లి మాట్లాడినట్టే ఉంటుందని అన్నాడు. దాంతో సీత మరింత ఎమోషనల్ అయిపోయింది. ఆ తర్వాత రియల్ కేటగిరిలో విష్ణుప్రియా పేరు చెప్పాడు. తను చాలా అమాయకురాలు అని సర్టిఫికెట్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే ముందు విష్ణుప్రియా గురించి తనకు ఏదేదో చెప్పి భయటపెట్టారని, కానీ తను అలా కాదని చెప్పాడు. ఎలా బ్రతుకుతావో ఏంటో అంటూ విష్ణుప్రియాపై జాలి కూడా చూపించాడు శేఖర్ భాషా.

వారు ఫేక్

ప్రేరణకు కూడా రియల్ అనే సర్టిఫికెట్ ఇచ్చాడు శేఖర్ భాషా. ఆటలో వైలెన్స్‌ను ఎంకరేజ్ చేయడం తప్పా తనలో ఇంకా ఎలాంటి చెడు లక్షణం లేదని అన్నాడు. ఫేక్ మనుషుల విషయానికొస్తే.. ముందుగా సోనియా పేరు చెప్పాడు శేఖర్ భాషా. సోనియాను చూడగానే ముందు తను నవ్వు బాగుంటుందని అనుకున్నానని కానీ తరువాత రోజు నామినేషన్స్‌లోనే మహాంకాళిగా మారిందని తెలిపాడు. మణికంఠను కూడా ఫేక్ అనే అన్నాడు. ఎవరైనా మాట్లాడుతుంటే వారికి వెంటనే స్పందించకుండా ఆలోచించి స్పందించడం తన స్ట్రాటజీ అని తెలిపాడు. కానీ దానికి మణికంఠ ఒప్పుకోవడం లేదు అన్నట్టుగా తల ఊపాడు. ఆదిత్య ఓం.. తనను నామినేట్ చేసినప్పుడు సరదాగా తీసుకున్నానని, కానీ తను అలా తీసుకోలేదని, సూటిపోటి మాటలు మాట్లాడాడని గుర్తుచేసుకొని తనకు ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చాడు శేఖర్ భాషా.

Related News

Bigg Boss 8 Day 44 Promo1: నామినేషన్ రచ్చ.. తారస్థాయికి చేరిన గొడవ..!

Bigg Boss 8 Telugu: సొంత మనుషులే ప్రేరణకు వెన్నుపోటు, మణికంఠకు అన్యాయం.. అందరూ కలిసి తేజను గట్టెంక్కిచారుగా!

Bigg Boss Sita : బిగ్ బాస్ నుంచి బయటకొచ్చినా ఆ కోరిక తీరలేదని సీత ఎమోషనల్..

Bigg Boss: ఏడవ వారం నామినేషన్స్ జాబితా.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..!

Bigg Boss 8 Telugu: నయని నోరుమూయించిన గంగవ్వ, ప్రేరణపై పగపట్టి న పృథ్వి.. ఈసారి నామినేషన్స్ అదుర్స్

Bigg Boss 8 Day 43 Promo 1: గౌతమ్ ఇక మారవా.. యాంగ్రీ మెన్ గా మారిన కూల్ పర్సన్..!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో మరో రచ్చ.. అతడు నామినేట్ చేస్తే ఎలిమినేట్?

Big Stories

×