Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టిన సోనియా.. మొదటి రోజు నుండే అందరితో గొడవలు పడుతూ ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పిస్తోంది. అయినా కూడా తనను తాను ఆడపులి అనుకుంటూ తన గురించి తాను గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ వర్కవుట్ అయ్యేలా ఉంది అని ప్రేక్షకులు సైతం అనుకునేలా చేసింది సోనియా. ఒకేసారి అటు నిఖిల్‌తో, ఇటు పృథ్విరాజ్‌తో మంచిగా ఉంటూ ఇద్దరూ తనకు క్లోజ్ అంటూ ప్రేమకథ మొదలుపెట్టిందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ తన పర్సనల్ లైఫ్‌లోని అసలు గుట్టును నాగార్జున బయటపెట్టేశారు.
వారిద్దరూ అన్నయ్యలు
సోనియా.. ఎక్కడ పడితే అక్కడ YS అని రాసుకొని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. దీంతో ఆదివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో అసలు YS అంటే ఏంటి అని నాగార్జున అడిగారు. దానికి సమాధానం చెప్పకుండా సోనియా సిగ్గుపడింది. దీంతో సోనియా బాయ్‌ఫ్రెండ్ పేరు యశ్వీర్ అని నాగార్జుననే రివీల్ చేసేశారు. వెంటనే సోనియా షాకయ్యింది. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నా కూడా నిఖిల్, పృథ్వితో క్లోజ్‌గా ఉంటుంది అని సోనియాపై ఆడియన్స్‌లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అలా క్లోజ్‌గా ఉండడంతో పాటు వారిని అన్నయ్యలు అంటూ ప్లేట్ మార్చేసిన విషయాన్ని కూడా వారు గుర్తుచేసుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ హౌజ్‌లో సోనియా గుట్టు బయటపడింది.
Also Read: అభయ్‌కు సోనియా వెన్నుపోటు, నిఖిలే కావాలంటూ రూట్ ఛేంజ్.. తనకు బ్రెయిన్ లేదని ఒప్పుకున్న విష్ణుప్రియా
కలిసిపోయారు
ఇప్పటికీ రూటు మార్చే విషయంలో సోనియానే ఎక్స్‌పర్ట్ అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఎందుకంటే అభయ్ చీఫ్ అయితే బాగుంటుందని తనకు ఓటు వేసింది సోనియా. చివరికి ఎవరి టీమ్‌లో చేరాలి అనే విషయానికి వచ్చేసరికి అభయ్ కాకుండా నిఖిల్ పేరు చెప్పింది. దీంతో అందరూ షాకయ్యారు. సోనియాతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన నిఖిల్.. తనను టీమ్‌లోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటికే తన టీమ్‌లో విష్ణుప్రియా కూడా ఉంది. అలా ఇద్దరూ ఒకే టీమ్‌లో చేరారు. మొత్తానికి ఒకే టీమ్ కావడంతో వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను మర్చిపోయి ఫ్రెండ్స్ అవ్వాలనుకొని హగ్ చేసుకున్నారు.
సీత బ్రేకప్ స్టోరీ
బిగ్ బాస్ హౌజ్‌లో గతవారం జరిగిన టాస్కులోనే తను గతంలో అయిదేళ్లు ఒక మనిషితో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది సీత. అసలు ఆ బ్రేకప్ స్టోరీ ఏంటి అని నాగార్జున ప్రత్యేకంగా అడిగారు. అయితే తాను గతంలో అయిదేళ్లు ఒక మనిషితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని చెప్పుకొచ్చింది సీత. కానీ ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ విషయాన్ని ఆ అబ్బాయితో ఎలా చెప్పాలా అని ఆరు నెలలు ఆలోచించిదట. కానీ చివరికి ఆ అబ్బాయే తనను ఏడాది నుండి మోసం చేస్తున్నాడనే విషయం బయటపడిందట. దీంతో సైకియాట్రిస్ట్ సాయంతో ఆ బ్రేకప్ నుండి బయటికి వచ్చానని, మంచి లైఫ్ చూశానని సంతోషం వ్యక్తం చేసింది సీత.