BigTV English

Yamini Malhotra: బిగ్ బాస్‌కు వెళ్లొచ్చాక అద్దెకు ఇల్లు కూడా ఇవ్వడం లేదు.. నటి ఆవేదన

Yamini Malhotra: బిగ్ బాస్‌కు వెళ్లొచ్చాక అద్దెకు ఇల్లు కూడా ఇవ్వడం లేదు.. నటి ఆవేదన

Yamini Malhotra: బిగ్ బాస్ అనే రియాలిటీ షో అసలు మనుషులు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్ని ప్రేక్షకులకు క్లియర్‌గా తెలిసేలా చేస్తుంది. సీరియల్స్, సినిమాలు చూసి సెలబ్రిటీలను ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. కానీ వారు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు అని బయటపెట్టే షోనే బిగ్ బాస్. దాని వల్ల ఎంతోమంది చిన్న సెలబ్రిటీలు విపరీతమైన పాపులారిటీ దక్కించుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. కానీ కొందరు మాత్రం ఈ షో నుండి బయటికి వచ్చిన తర్వాత కష్టాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా హిందీ బిగ్ బాస్ 18లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఒక నటి.. దాని వల్ల తన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యిందో చెప్తూ బాధపడింది.


వైల్డ్ కార్డ్ ఎంట్రీ

హిందీలో బిగ్ బాస్ ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా 18వ సీజన్ కూడా ఎండింగ్‌కు వచ్చింది. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది యామినీ మల్హోత్రా. వృత్తిరీత్యా డాక్టర్ అయినా కూడా ప్యాషన్‌తో యాక్టింగ్‌లోకి ఎంటర్ అయ్యింది యామిని. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించింది. అలా బిగ్ బాస్‌లో అవకాశం కూడా దక్కించుకుంది. బిగ్ బాస్ 18లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత ప్రేక్షకుల ఫోకస్ అంతా యామిని మల్హోత్రాపై పడింది. తన ఆటతీరు చాలామంది ప్రేక్షకులకు నచ్చింది. కానీ ఎక్కువమందిని ఇంప్రెస్ చేయలేక కొన్నాళ్లకే హౌస్‌ను వదిలేసి వెళ్లిపోయింది యామిని. ఆ తర్వాతే తనకు అసలు కష్టాలు మొదలయ్యాయి.


మతం ఏంటి.?

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ముంబాయ్‌లో తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కూడా అందరూ ఆలోచిస్తారని వాపోయింది యామిని మల్హోత్రా. తను అప్‌కమింగ్ నటి కాబట్టే అందరూ ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన యామిని డెంటిస్ట్ అయినా కూడా యాక్టింగ్ మీద ప్రేమతో ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు తనకు ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా కూడా తన మతం ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని మరీ మరీ అడుగుతున్నారట. బయటి నుండి వచ్చేవారికి ఇక్కడ విలువ ఉండదని, నెపో కిడ్ అయితేనే వారు అనుకున్నవి జరుగుతాయని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది యామిని మల్హోత్రా.

Also Read: సింగిల్ అంటూ షాక్ ఇచ్చిన నిఖిల్.. హౌస్ లో చెప్పిందంతా సింపథీ కోసమేనా..?

కలలు నెరవేరవు

ముంబాయ్ అనేది కలల ప్రపంచం అని అందరూ అంటుంటారు. అలాంటి కలల ప్రపంచంలో బయటివారికి ప్రవేశం లేదని, అలాంటి సమయంలో వారి కలలు ఎలా నెరవేరుతాయని నేరుగా ప్రశ్నించింది యామిని మల్హోత్రా (Yamini Malhotra). అలా యామిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌కు ఉన్న సౌకర్యాలు మరెవరికీ లేవని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చాలామంది అప్‌కమింగ్ నటీనటులు ఈ విషయంపై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి బిగ్ బాస్ బ్యూటీ యామిని మల్హోత్రా కూడా యాడ్ అయ్యింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×