కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) తన నటనతో విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సినీ రచయితగా, టీవీ వ్యాఖ్యాతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. కన్నడలో ప్రముఖ కథా నాయకుడైన ఈయన.. ‘ఈగ’ సినిమాతో తొలిసారి తెలుగులో ప్రతినాయక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ 11వ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
హోస్ట్ సుదీప్ పై తెలుగువారి రూమర్స్..
కన్నడలో 2013లో కిచ్చా సుదీప్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ వన్ నుంచీ పనిచేయడం ప్రారంభించారు. ప్రస్తుతం కన్నడలో 11వ సీజన్ జరుపుకుంటూ ఉండగా.. ఇదే తన చివరి సీజన్ అంటూ కూడా ప్రకటించారు. కన్నడ బుల్లితెర ఇండస్ట్రీలో ఈ సీజన్ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రారంభం అవ్వగా.. అదే రోజు సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు సుదీప్. దాదాపు గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కిచ్చా సుదీప్ పై తాజాగా తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ చేసిన కామెంట్లు ఆయనను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేశాయని సమాచారం.
అనుమానాలకు చెక్ పెట్టిన సుదీప్..
అసలు విషయంలోకెళితే.. బిగ్ బాస్ స్టేజ్ పైన.. కిచ్చా సుదీప్ ఒక్కోసారి సీరియస్ గా కనిపిస్తారు. మరోసారి కంటెస్టెంట్స్ తో జోకులు వేస్తూ కనిపిస్తారు. అంతే కాదు ఫిలాసఫర్ గా, సీరియస్ అనలిస్ట్ గా కూడా కనిపిస్తారు. అలాంటి ఈయనపై తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ స్టేజ్ పైన కిచ్చా సుదీప్ తాగుతున్నది.. విస్కీ నా అంటూ అసత్య ప్రచారాలు , అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో కిచ్చా సుదీప్ వరకు చేరిపోయాయి. దీంతో వెంటనే రియాక్ట్ అయిన కిచ్చా సుదీప్ బిగ్ బాస్ స్టేజ్ పై కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ..” బిగ్ బాస్ షోని చూసే తెలుగు ఆడియన్స్… హోస్ట్ సుదీప్ స్టేజ్ పై తాగుతున్నది విస్కీ నా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.. ఇది విస్కీ కాదు.. రమ్ కాదు.. టకీలా కాదు.. కాఫీ మాత్రమే.. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నాపై వ్యక్తం చేసిన అనుమానాలకు క్లారిటీ ఇస్తున్నాను” అంటూ తెలిపారు కిచ్చా సుదీప్. మొత్తానికి అయితే తెలుగువారి అనుమానాలకు, రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.
తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న సుదీప్..
ఇక కిచ్చా సుదీప్ విషయానికి వస్తే.. ఇటీవల అక్టోబర్ 19వ తేదీన బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండగా.. ఆయన తల్లికి అస్వస్థతకు గురైందనే వార్త విని వెంటనే షోని ఆపేసి ఆయన వెళ్లిపోయారు. అయితే ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల్లి అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. చాలా సందర్భాలలో తన తల్లి గురించి చెప్పుకొచ్చారు కూడా.. అలాంటిది తన తల్లి ప్రాణాలతో లేదని తెలిసి ఆ బాధను దిగమింగుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవల బిగ్ బాస్ వేదికపై కూడా తన తల్లికి నివాళులర్పించి కన్నీటి పర్యంతం అయ్యారు సుదీప్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">