BigTV English

Anushka Shetty: పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన అనుష్క..!

Anushka Shetty: పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన అనుష్క..!

Anushka Shetty:సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా మంది వివాహం చేసుకోకుండా.. కెరియర్ పైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగు పదుల వయసు దాటినా.. ఇంకా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్ల జాబితా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అలాంటి వారిలో త్రిష (Trisha), అనుష్క(Anushka ) పేర్లు ప్రధమంగా వినిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున పలు రకాల కథనాలు కూడా వినిపిస్తూనే ఉన్నా.. వీరు మాత్రం పెళ్లి వార్తలపై స్పందించరు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతూ ఉంటుంది.


పెళ్లి రూమర్స్ పై స్పందించిన అనుష్క..

ఇకపోతే గత కొద్ది రోజులుగా అనుష్క పెళ్లి గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది. అనుష్క మాట్లాడుతూ.. ” నాకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో నేను ఎప్పుడు బాధపడలేదు. అయినా పెళ్లి పెళ్లి అని అంటున్నారు కదా వారు.. మరి.. ఎక్కడ ఎవరితో జరిగిందో మాత్రం చెప్పడం లేదు. వివాహ విషయాన్ని దాయాల్సిన అవసరం ఏముంది. అది నేరం కాదు కదా.. భావోద్వేగంతో కూడిన విషయం. ఇకనైనా అసత్య ప్రచారాలు చేయకండి” అంటూ అనుష్క తెలిపినట్లు సమాచారం. అంతేకాదు “సమయం వస్తే అందరికీ కచ్చితంగా తెలియజేస్తానని” అనుష్క చెప్పుకొచ్చింది.


సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం..

సూపర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెంగళూరు బ్యూటీ స్వీటీ శెట్టి.. ఈ సినిమా సమయంలో సోనూసూద్ (Sonusood) సలహా మేరకు తన పేరును మార్చుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన ఈమె అటు తమిళ్ లో విజయ్ (Vijay), సూర్య(Suriya), అజిత్ (Ajith) వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించారు. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన అనుష్క.. సడన్గా సైజ్ జీరో చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిపోయి ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించక ఇండస్ట్రీకి దూరమయింది.

ఇప్పటికీ ఆగని రూమర్స్..

ఇక కొన్నాళ్లు విరామం ప్రకటించిన ఈమె ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది . ఈ సినిమాతో మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకున్న అనుష్క.. ఇప్పుడు క్రిష్ (Krish ) దర్శకత్వంలో ‘ ఘాటి’ అనే వైవిధ్యభరిత కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మరోవైపు ఒక మలయాళ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇకపోతే వ్యక్తిగతంగా అనుష్క ఎన్నో విమర్శలు ఎదుర్కొందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలు అసత్య ప్రచారాలను ఆమె ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒకరిద్దరితో ఎఫైర్ రూమర్స్ అంటగట్టిన సోషల్ మీడియా తాజాగా మరో రూమర్ తెరపైకి తీసుకొచ్చింది.

టాలీవుడ్ డైరెక్టర్ తో పెళ్లికి సిద్ధం..

దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకోవడానికి అనుష్క సిద్ధమవుతున్నట్లు ప్రచారాలు జోరుగా వినిపించాయి. మరోవైపు ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్ తో పెళ్లి సిద్ధమయింది అంటూ కూడా రూమర్స్ వచ్చాయి. కానీ ఇందులో వేటిని కూడా ఆమె ధ్రువీకరించలేదు. అందుకే ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చింది అనుష్క.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×