Nindu Noorella Saavasam Serial Today Episode : గుడికి వెళ్తున్న ఆరును చూసిన మిస్సమ్మ తనతో పాటు ఆరును రమ్మని అడుగుతుంది. ఆరు సంతోషంగా సరే అనబోతుంటే.. గుప్త వద్దని అక్కడకు వెళితే లేనిపోని సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు. అయినా వినకుండా ఆరు వెళ్దాం అని అంటుంది. దీంతో గుప్త నువ్వు ఆ బాలికతో వెళితే నీతో ఆ బాలిక మాట్లాడటం ఎవరైనా చూస్తే ఈ బాలికకు నిజం తెలుస్తుంది అంటాడు గుప్త. నేను మేనేజ్ చేస్తాను కదా..? అంటుంది ఆరు. ఇంతలో వెనక నుంచి వచ్చిన మనోహరి.. ఆరుతో మిస్సమ్మ మాట్లాడటం చూసి చనిపోబోయే ముందు సచ్చినదానితో మాట్లాడుతుంది అనుకుని చూస్తుంది.
ఇంతలో గుడికి మిస్సమ్మ, ఆరు కలిసి వెళ్లడం చూసి మనోహరి షాక్ అవుతుంది. వెంటనే లోపలికి వెళ్లి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. మిస్సమ్మతో పాటు ఆరు కూడా గుడికి వస్తుందని చెప్తుంది. దీంతో బాబ్జీ షాక్ అవుతాడు. అదేంటి మేడం ఒక్కరే వస్తుందన్నారు కదా..? వచ్చేలా చేస్తా అన్నారు కదా..? మధ్యలో ఈ ఆత్మ ఏంటి..? అంటాడు. ఇప్పుడేంటి నేను వెళ్లి నిన్ను చంపినట్టే నీ చెల్లెలును కూడా చంపాలని చూస్తున్నాను నువ్వు దానితో వెళ్లకు అని చెప్పాలా..?అలా ఎందుకు చెప్తారు మేడం.. ఏదో ఒకటి చేసి రాకుండా చేయోచ్చు కదా..? ఓరేయ్ లూజు ఆది మనిషి కాదు ఆత్మ. పైగా నేను దాన్ని చంపించానని తెలిసిపోయింది. నేను చెప్తే అసలు వినదు.
ఇప్పుడెలా మేడం అరుంధతి పక్కన ఉండగా మిస్సమ్మను ఎలా చంపాలి. ఆల్‌రెడీ ఒకసారి చంపేశావు. దానికి నువ్వు బాధపడటం దేనికి.. నువ్వు అనుకున్నట్టుగానే ఆ మిస్సమ్మను చంపేయ్ అని మనోహరి చెప్పగానే సరే అంటాడు బాబ్జీ. ఇంటికి రాథోడ్ రాగానే రావయ్యా రాథోడ్ కొంచెం ముందు వచ్చి ఉంటే.. మిస్సమ్మను ఎక్కించుకెళ్లేవాడివి కదా..? అంటాడు శివరాం. అవునా సార్ ఎంత సేపు అయింది సార్ వెళ్లి అని రాథోడ్ అడగ్గానే ఐదు నిమిషాలు అయ్యింది అని శివరాం చెప్పగానే అయితే చాలా దూరం వెళ్లదులే సార్.. నేను వెళ్లి డ్రాప్ చేస్తాను అంటూ రాథోడ్ వెళ్లబోతుంటే.. ఒక్క నిమిషం రాథోడ్ మిస్సమ్మ మనఃశాంతి కోసం గుడికి వెళ్తుంది. కదా..? నువ్వు వెళ్లి డిస్టర్బ్ చేయకు అంటుంది.
అయితే మీరు ఖాళీగానే ఉన్నారు కదా..? మీరు డ్రాఫ్ చేసి ఉండొచ్చు కదా అంటాడు రాథోడ్. నేనా నేను అమర్‌ను చూసుకోవాలి కదా…? అంటుంది మనోహరి. మీరా వద్దులే మేడం మీరు ఒక్కసారి కాఫీ ఇచ్చినందుకే ఇప్పటికే కాఫీ అంటేనే భయపడిపోతున్నారు అంటూ రాథోడ్ వెళ్లిపోతాడు. రోడ్డు మీద ఆరు, మిస్సమ్మ, గుప్త నడుస్తుంటారు. ఆరు, గుప్తతో మాట్లాడుతుంటే మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు అక్కా అని అడుగుతుంది. ఏదైనా మీరు కొంచెం తేడా అక్కా అంటుంది. అదేంటి మిస్సమ్మ పుసుక్కున అంత మాట అనేశారు. అనగానే గుప్త నవ్వుతుంటాడు. అదంతా సరే మిస్సమ్మ నువ్వు నాకు ఏదో చెప్పాలి అన్నావు కదా..? అదేంటి అని అడుగుతుంది ఆరు. అదా అక్క ఆరు అక్క చనిపోయినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం.. ఏదో ఒక కష్టం ఈ ఇంటిని వెంటాడుతూనే ఉంది.
ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక చాలా భయంగా ఉంది అక్కా అంటూ బాధపడుతుంది మిస్సమ్మ. దీంతో ఆరు ఆ రౌడీల పీడ వదిలిపోయింది కదా..? ఇక ఏ సమస్య ఉండదులే అంటూ ఓదారుస్తుంది. ఇన్ని అనుమానాల మధ్య అదొక్కటే ఊరటగా ఉంది అక్కా.. కానీ ఆ మనోహరిని చూస్తుంటేనే అప్పుడప్పుడు భయంగా ఉంటుంది. ఆ మనోహరి ఎన్ని తప్పులు చేసినా సాక్ష్యాలు దొరక్కుండా చాలా జాగ్రత్త పడుతుంది అని మిస్సమ్మ చెప్తుంటే.. ముందు ఆ మనోహరిని పిల్లలకు ఆయనకు దూరం చేయాలి మిస్సమ్మ. అది పక్కన ఉన్నంత వరకు అందరికీ దినదిన గండం అని మనసులో అనుకుంటుంటే.. అక్కా అక్కడే నిలబడిపోయావేంటి రండి అని పిలుస్తూ మిస్సమ్మ నడుస్తుంది.
వెనక నుంచి లారీలో వస్తున్న బాబ్జీ మిమ్మల్ని చంపేయడానికి వస్తున్నాను మేడం.. రెండే రెండు నిమిషాలు అంటూ లారీ స్పీడుగా నడుపుతుంటాడు. స్పీడుగా వస్తున్న లారీని చూసిన ఆరు భయంతో అలాగే ఆగిపోతుంది. లారీని, ఆరును చూసిన మిస్సమ్మ అక్కా అంటూ పక్కకు లాగడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో లారీ చెట్టును గుద్దేస్తుంది. బాబ్జీని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. బాబ్జీ ఫోన్‌కు కాల్ చేసిన మనోహరి విషయం తెలుసుకుని షాక్ అవుతుంది.
మిస్సమ్మ అనుమానంగా ఆరు దగ్గరకు వెళ్లి అక్కా నేను మిమ్మల్ని తోయడానికి వచ్చాను కదా..? మరి నేనెందుకు బాలెన్స్ తప్పాను అని అడుగుతుంది. అక్కా మిమ్మల్ని తోసేస్తుంటే మీరు నాకు టచ్ అవ్వలేదేంటి అని అనుమాన పడుతుంది. మిస్సమ్మ నాకేం అవుతుందని నువ్వు నన్ను తోయడానికి వచ్చావు కదా..? నీకు ఏమౌతుందోనని నేను నిన్ను తోసేశాను అంటుంది ఆరు. దీంతో మిస్సమ్మ కన్పీజ్‌గా లేదు అక్కా ఏదో జరిగింది అని అడుగుతుంది. దీంతో ఆరు ఏదేదో చెప్తుంటే మిస్సమ్మ అర్థం కాలేదు అక్కా అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?