BigTV English

ShivaPriya : బిగ్ బాస్ ప్రియాంక జైన్, శివ్ బ్రేకప్.. వీడియో రిలీజ్ చేసిన జంట..

ShivaPriya : బిగ్ బాస్ ప్రియాంక జైన్, శివ్ బ్రేకప్.. వీడియో రిలీజ్ చేసిన జంట..

ShivaPriya : బుల్లితెర హీరోయిన్ ప్రియాంక జెన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. బుల్లితెరపై ప్రసారమవుతున్న వాళ్లు సీరియల్స్లలో హీరోయిన్గా నటించి అందరి మనసును దోచుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొన్న ఈమె అక్కడ తన ఆట తీరుతో అందరినీ మెస్మరైజ్ చేసింది. అంతేకాదు తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించిన ఈమె టాప్ ఫైవ్ ఫైనలిస్టులో ఏకైక లేడీగా నిలిచి, అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రియల్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీరిద్దరి లవ్ బ్రేకప్ అయిందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకు కారణం శివ రిలీజ్ చేసిన ఒక వీడియో అని తెలుస్తుంది ఇంతకీ ఆ వీడియోలో ఏముందో? బ్రేకప్ చెప్పుకునే అంత కారణమేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


శివ, ప్రియాంక బ్రేకప్.. 

బుల్లితెర లవ్ బర్డ్స్ ప్రియాంక జైన్ శివ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వీళ్ళు చేసే హంగామా అంతా ఇంత కాదు.. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు కానీ సడన్గా మీరిద్దరూ విడిపోయారంటూ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో వీళ్ళు చాలాసార్లు ఫ్రాంక్ వీడియోలను చేసారు. ఇది కూడా అలానే ఫ్రాంక్ అయితుందని అందరు అనుకుంటున్నారు కానీ శివ మాత్రం ఇది నిజంగానే బ్రేకప్ అని ఆ వీడియోలో చెప్పడం చర్చనీయంశంగా మారింది.. ఆ వీడియోలో శివ మాట్లాడుతూ నేను ఏదో ఫ్రాంక్ చేశాను. కానీ ప్రియా గారు నిజమే అని నమ్మారు. ఇక బ్రేకప్ అని చెప్పారని అన్నాడు. ఆ వీడియోలో ప్రియాంక మాట్లాడటం కూడా కనిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వాళ్ళిద్దరూ మీడియా ముందుకొచ్చి నిజాన్ని బయట పెట్టేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..


వివాదాలకు కేరాఫ్ గా శివ ప్రియా..

ఈ జంట సీరియల్స్ సినిమాలు చేయడం తక్కువే కానీ వివాదాలను మాత్రం కోరి తెచ్చుకుంటున్నారు. గతంలో తిరుమలలో పులి ఉందంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. జస్ట్ ప్రాంక్ వీడియో అని తర్వాత మరో వీడియోను రిలీజ్ చేసి క్షమాపణలు కోరారు. అదేవిధంగా త్రివేణి సంఘమంలో పుణ్య స్థానాలు ఆచరించిన వీరు ఆ తర్వాత కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు . దీంతో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన చాలామంది పాజిటివ్ గానే స్పందించారు. కానీ అదే సమయంలో మరికొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దేవుడి దగ్గరికి కూడా మీరు ఫోటోషూట్స్, రీల్స్ కోసం వెళ్లడం అవసరమా? అన్నట్లు కామెంట్లు చేశారు.. ఈమధ్య ప్రియాంక చేంజ్ చేస్తున్న వీడియోలు కొన్ని అవసరపు సమాచారాన్ని ఇస్తే, మరికొన్ని అనవసరపు విషయాల గురించి చెప్తున్నట్లు కనిపిస్తుంటాయి. అందుకే ఆమె నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది.. ఇప్పుడు ఈ బ్రేకప్ వీడియోతో మరోసారి వార్తల్లో హైలెట్ అవుతుంది..

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×