Ugadi Celebrations: ఏపీ వ్యాప్తంగా ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ‘విశ్వావసు’ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నారు. మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? షట్ గ్రహ కూటమి ప్రభావం ఏపీపై పడుతుందా? దీనిపై పండితులు ఏమన్నారు? చిన్న చిన్న సమస్యలు తప్పవని అన్నారు పండితులు మాడుగుల నాగఫణి శర్మ. అందుకు కారణాలు సైతం ఆయన చెప్పేశారు.
ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు సీఎం చంద్రబాబు. ఉగాది పచ్చడిని రుచి చూశారు. అనంతరం పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు.
షట్ గ్రహ కూటమి ప్రభావం ఎంత?
మార్చి 29న శనివారం రోజు అమావాస్య షట్ గ్రహ కూటమి ఏర్పడింది. దీనికితోడు సూర్యగ్రహణం ఏర్పడింది. విశ్వావసు ఏడాదిలో అమావాస్య రోజు మీనరాశిలో ఏర్పడింది. రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాలు కలవడం వల్ల అరిష్టం అని కొందరు పండితుల మాట.
అందులో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయన్నారు. దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయో తప్ప, ప్రమాదకరమైనవి కావని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శాస్త్రం ఉంటుందని దాన్ని సమన్వయం చేసుకోవడంలో మానవుడి యొక్క జ్ఞానం ఉంటుందన్నారు. మానవుడి జీవితం వడ్డించిన విస్తరి కాదన్న పండితులు, వాటిని స్వీకరించాల్సిందేనని అన్నారు. అందువల్ల పరమేశ్వరుడు అప్పుడప్పుడు ఇలాంటివి పెడతారన్నారు.
ALSO READ: తెలుగు ప్రజల తొలి పండుగ.. ఉగాది స్పెషలేంటి?
ఈ ఏడాది విశేషం ఏంటంటే.. సింహా-కన్యా లగ్నానికి గురువు చాలా గొప్పగా ఉన్నారని వివరించారు పండితులు మాడుగుల నాగఫణి శర్మ. దీనివల్ల విశేషమైన విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు. ధార్మికమైన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయన్నారు.
ఈ ఏడాది విశేషం ఏంటంటే.. సింహా-కన్యా లగ్నానికి గురువు గొప్పగా ఉన్నారని వివరించారు పండితులు మాడుగుల నాగఫణి శర్మ. దీనివల్ల విశేషమైన విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు. ధార్మికమైన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయన్నారు. దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయన్నారు.
విద్యా పరమైన విషయాలు ఇప్పటికే ఏపీలో ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఎందుకంటే చదువుతున్న పిల్లలకు బరువు లేని రోజును ప్రభుత్వం పెట్టిందని గుర్తు చేశారు. విద్యా ప్రణాళికలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడుతాయన్నారు. కళలు, విద్య వైభవం సంతరించుకుంటుందన్నారు.
2019లో షట్ గ్రహాల కూటమి
షట్ కూటమి ప్రభావం 12 రాశుల వారిపై ఉంటుందన్నారు కొందరు జ్యోతిష్యులు. గడిచిన రెండు రోజులుగా దీనిపై టీవీల్లో జోరుగా చర్చ సాగింది. ముఖ్యంగా మే 31 వరకు దాని ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2019 డిసెంబర్ 25న షట్ గ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయ తాండవం చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు మార్చి 29న శనివారం అమావాస్య రోజు షట్ గ్రహ కూటమి ఏర్పడింది. కాకపోతే ఈసారి గ్రహాలు మార్పు జరిగిందని అంటున్నవాళ్లూ లేకపోలేదు.