Bigg Boss 9 Promo : బిగ్బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మునుపటి సీజన్స్ కంటే ఈ సీజన్ కొంతమేరకు ఎక్కువ ఆసక్తికరంగానే ఉంది. అలానే బోలెడు ట్విస్టులు ఈ సీజన్లో కనిపిస్తున్నాయి. ఈ క్షణం తిట్టుకున్న వాళ్లే మరుక్షణం క్లోజ్ అయిపోతున్నారు. ఎవరిని శత్రువులు అని ఫీలవుతున్నామో వాళ్లే మిత్రులు అయిపోతున్నారు.
మొదటి వారంలోనే బయటకు వెళ్ళిపోతుంది అనుకున్న సంజన కెప్టెన్ అయిపోయింది. ఎవరు ఊహించిన విధంగా డిమాన్ పవన్ కూడా కెప్టెన్ అయిపోయాడు. దీనిని బట్టి ఎన్ని ట్విస్టులు బిగ్ బాస్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రాము మరియు ఇమ్మానుయేల్ ఫైనల్ గా నిలిచారు. వీరిద్దరిలో ఓనర్ గా వెళ్లే అవకాశం ఒకరికి దక్కింది. ఆ ఓనర్ గా వెళ్లే పర్సన్ ని సెలెక్ట్ చేయమని కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఆదేశం ఇచ్చారు. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత రాముని ఓనర్ గా సెలెక్ట్ చేశారు హౌస్ మేట్స్.
రాముని ఓనర్ గా సెలెక్ట్ చేసిన వెంటనే, రీతు మరొక పాయింటు బయటకు తీశారు. దీనితో శ్రీజ దమ్ము, ప్రియ శెట్టి కలిసి ఇంతసేపు రాముని ఓనర్ గా యాక్సెప్ట్ చేశావు. ఇప్పుడు రాము అంటేనే మళ్లీ కొత్త పాయింట్స్ తీస్తున్నావ్ అని అరవడం మొదలుపెట్టారు.
రీతూ చౌదరి నీకంటూ ఒక స్టాండ్ లేదు అంటూ వారిద్దరూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. నేను నీతో మాట్లాడట్లేదు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను అంటూ రీతు చౌదరి శ్రీజ దమ్ముకి రిటర్న్ ఆన్సర్ ఇచ్చింది.
రాముని సెలెక్ట్ చేసిన తర్వాత ఏం ఆడాడు ఇమ్మానుయేల్.? అంటూ ఇమ్మానుయేల్ హౌస్ మేషను క్వశ్చన్ చేశాడు. నేను నా ఓన్ గేమ్ ఆడితే పీస్ పీసులు చేసేవాన్ని ఒక బాక్స్ కూడా ఉండేది కాదు. నిన్న కూడా నేను ఓడిపోయినందుకు ఏడవలేదు అంటూ… రెండే దారులుంటాయి గెలవడానికి ఎలా గెలిచామనేది ఇంపార్టెంట్ అంటూ ఇమ్మానుయేల్ ఎమోషనల్ అయిపోయాడు.