OTT Movie : ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మరొక్కసారి నిరూపించారు మేకర్స్. 1967 లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ ఇప్పటికీ ఒక అద్భుతమే. ఇందులో S.V రంగారావు పాత్రను ఎప్పటికీ మరచిపోలేము. భక్త ప్రహ్లాద పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రోజా రమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కథనే హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ రూపంలో ప్రెజెంట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ థియేటర్లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా ₹325 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఈ రోజు నుంచి ఓటీటీలో కూడా అడుగుపెట్టి సంచలనాలు సృష్టించబోతోంది. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘మహావతార్ నరసింహ’ (Mahavatar narsimha) 2025లో విడుదలైన భారతీయ యానిమేటెడ్ ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ చిత్రం. ఈ సినిమా అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, జయపూర్ణ దాస్ రచనతో, క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో, హోంబలే ఫిల్మ్స్ ప్రెజెంట్ చేసింది. ఈ సినిమాకి ఆదిత్య రాజ్ శర్మ (హిరణ్యకశిపు), హరిప్రియ మట్ట (ప్రహ్లాద), ప్రియాంక భండారి (కాయడు), హర్జీత్ వాలియా (నరసింహ) స్వరాన్ని అందించారు. ఇది 2025 జూలై 25న థియేటర్లలో విడుదలై, హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలో 2D, 3D ఫార్మాట్లలో వచ్చింది. 2 గంటల 11 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 9.1/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 19 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ అనుభూతిని మరొక్కసారి పొందండి.
ఈ కథ విష్ణు పురాణంలోని శ్రీమద్ భాగవతం ఆధారంగా రూపొందింది. కశ్యప ముని ఒక సాయంత్రం పూజలో ఉండగా, అతని భార్య దితి సంతానం కోసం అడుగుతుంది. కశ్యప అది అశుభ సమయమని చెప్పినా, దితి పట్టుబట్టి సంతానం కోసం కశ్యప మునిని ఒప్పిస్తుంది. దీని ఫలితంగా ఆమెకు ఇద్దరు కుమారులు (హిరణ్యాక్ష, హిరణ్యకశిపు) జన్మిస్తారు. వాళ్లు విష్ణువు భక్తులను హింసిస్తారని, చివరికి విష్ణువు చేతిలో చనిపోతారని కశ్యప దితిని హెచ్చరిస్తాడు. హిరణ్యాక్ష పెద్దయ్యాక భూదేవిని ఇబ్బంది పెడతాడు. విష్ణువు వరాహ అవతారంలో అతన్ని సంహరిస్తాడు. దీంతో సోదరుడి మరణానికి విష్ణువుపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు హిరణ్యకశిపుడు.
ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. అతను విష్ణు భక్తులను హింసిస్తాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాద విష్ణువు భక్తిలో లీనమవుతాడు. దేవుళ్ళ మీద కోపంతో ఉన్న హిరణ్యకశిపు, ప్రహ్లాదకి కఠినమైన శిక్షలు అమలు చేస్తాడు. ఎంతగా హింసించినా ప్రహ్లాద విష్ణువు మీద తన భక్తిని మాత్రం వదలడు. ఇవన్నీ చూసిన హిరణ్యకశిపు ప్రహ్లాదను చంపడానికి తన సోదరి హోలిక సహాయాన్ని తీసుకుంటాడు. కానీ ఆమె కూడా అగ్నిలో కాలిపోతుంది. ఇక హిరణ్యకశిపు రాజ్యంలో అరాచకం పెరుగుతుంది. హిరణ్యకశిపు విష్ణువును సవాల్ చేస్తాడు. చివరికి విష్ణువు నరసింహ రూపంలో అవతరిస్తాడు. నరసింహ హిరణ్యకశిపును సంహరిస్తాడు. ఈ సన్నివేశం క్లైమాక్స్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది.
Read Also : దెయ్యాలు మేనేజ్ చేసే హోటల్ ఇది… ఫ్యామిలీ ఎంట్రీతో ట్విస్టు… హిలేరియస్ హార్రర్ సిరీస్