BigTV English
Advertisement

Bigg Boss Telugu 8 : నేను తప్పుగా మాట్లాడలేదు… బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ పరువు తీస్తున్న అభయ్..!

Bigg Boss Telugu 8 : నేను తప్పుగా మాట్లాడలేదు… బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ పరువు తీస్తున్న అభయ్..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఇప్పుడు 8వ సీజన్ జరుపుకుంటోంది. ఎనిమిదవ సీజన్లో భాగంగా మూడు వారాలు పూర్తవగా.. మూడవ వారం అభయ్ (Abhay) ఎలిమినేట్ అయ్యాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఈయన్ నోటి దూల కారణంగా ఎలిమినేట్ అయ్యారు అని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ పెట్టే టాస్కులు ఆడలేక, బిగ్ బాస్ పై విచక్షణారహితంగా  మాటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బయాస్డ్ బిగ్ బాస్ అని , బిగ్ బాస్ పెళ్ళాంతో గొడవపడి టాస్కులు మారుస్తున్నాడు అని, గౌరవం లేకుండా మాట్లాడడంతోనే అభయ్ ను ఎలిమినేట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.


బిగ్ బాస్ ను తిట్టడం పై అభయ్ క్లారిటీ..

అయితే తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన అభయ్ బిగ్ బాస్ ను తిట్టడానికి గల కారణం ఏంటి..? అనే విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ లో పాల్గొని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ కంటెస్టెంట్స్ అయిన బేబక్క, ఆర్ జె శేఖర్ తోపాటు అభయ్ కూడా పాల్గొని తాను బిగ్ బాస్ ను అంతలా తిట్టడానికి అసలు కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ఒక మనిషి పదిమందికి వంట చేయొచ్చు కదా.. అలాంటి ముగ్గురు ఆరుగురికి వంట చేయలేరా అని ప్రశ్నించగా.. దానికి అభయ్ మాట్లాడుతూ.. చేయొచ్చు కానీ మూడు రోజుల నుండి సరైన తిండి లేదు. సడన్ గా మాకు రేషన్ వచ్చింది. రేషన్ వచ్చింది అని సంతోషపడేలోపే టైమర్ కూడా ఇచ్చారు. ఒక మనిషి ఎప్పుడు పది మందికి వండుతాడు.. టైం లిమిట్ లేకపోతే.. అలాంటిది కండిషన్స్ పెట్టి గంటలో వండుకోవాలంటే ఎలా అంటూ ఫైర్ అయ్యారు అభయ్.


ఫిజికల్ టాస్క్ లు చేయనని ముందే చెప్పా..

Bigg Boss Telugu 8 : I didn't speak wrong.. Abhay is defaming Bigg Boss after coming out..!
Bigg Boss Telugu 8 : I didn’t speak wrong.. Abhay is defaming Bigg Boss after coming out..!

అంతేకాదు బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. నేను తిడితే తిట్టారు అంటారు కానీ సరైన ఫుడ్ లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. రేపటి కోసం ఈ రోజే వండుకుంటే ఆ ఫుడ్ తినలేక ఆదిత్య గారికి మోషన్ అయ్యింది అంటూ తెలిపారు. ఇక ఫిజికల్ టాస్క్ ల గురించి మాట్లాడుతూ.. కొన్ని టాస్క్లలో కంటెస్టెంట్లు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. అందులో ప్రేరణ పరిస్థితి మరింత దారుణం. ఆమె చేతికి చాలా గాయాలయ్యాయి. రెండు చేతులు పూర్తిగా కందిపోయాయి. అందుకే ఏ గేమ్ లో అయితే ఫిజికల్ వైలెన్స్ ఉంటుందో ఆ గేమ్ ఆడనని నేను ముందే ఫిక్స్ అయ్యాను. ఫిజికల్ గేమ్స్ అయితే నేను ఆడను అని ముందే చెప్పేశాను. వేరే కంటెస్టెంట్లు ఆడుకుంటారంటే ఆడుకోండి అని తెగేసి చెప్పేసాను. అయితే ఆ సమయంలో నా కామెంట్స్ , నా ఒపీనియన్ పైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నా సరే ఆ తర్వాత జరిగే పరిణామాలు అన్నింటినీ ఎదుర్కొంటాను అని చెప్పాను. చీఫ్ గా తీసేసినప్పుడు ఎందుకు తీసేసారని కూడా నేను అడగలేదు కదా.. అంటూ సమాధానం చెప్పారు. గేమ్ స్ట్రాటజీతో ఆడాలి కానీ ఫిజికల్ గా ఆడకూడదు అంటూ తెలిపారు అభయ్. మొత్తానికైతే అభయ్ చేసిన కామెంట్లలో కూడా పాయింట్ ఉంది కదా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Big Stories

×