BigTV English

Viswam Story : గోపీచంద్ ఫ్యాన్స్ కు షాక్… విశ్వం స్టోరీ లీక్, హీరో రోల్ ఇదే?

Viswam Story : గోపీచంద్ ఫ్యాన్స్ కు షాక్… విశ్వం స్టోరీ లీక్, హీరో రోల్ ఇదే?

Viswam Story : మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం. ఈ మూవీ రిలీజ్ కు ఇంకా చాలా టైముంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. ఇలాంటి టైంలో విశ్వం మూవీ స్టోరీ లీకై గోపీచంద్ అభిమానులను షాక్ కు గురి చేసింది. మరి విశ్వం మూవీ స్టోరీ ఏంటి? అందులో హీరో పాత్ర ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


విశ్వం మూవీ స్టోరీ ఇదే?

గోపీచంద్ విశ్వం మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశ్వం మూవీ స్టోరీ లైన్ గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మొత్తం ఒక పాప చుట్టూ తిరుగుతుందనేది ఆ రూమర్ సారాంశం. ఇందులో హీరో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. అయితే సినిమా చివర్లో హీరో సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఫుల్ ఆఫీసర్ అనే విషయాన్ని ట్విస్ట్ తో రివీల్ చేస్తారు మేకర్స్ అంటూ విశ్వం స్టోరీ గురించి ఆసక్తికరమైన గుసగుసలు విన్పిస్తున్నాయి.


ఇక ఈ స్టోరీ లైన్ వింటుంటే గోపీచంద్ ఆ పాప కోసం పగ తీర్చుకుంటాడు అని అనిపిస్తోంది. అయితే ఆ పాప ఎవరు? గోపీచంద్ ఎందుకు ఆమె గురించి ఇలాంటి పని చేస్తున్నాడు? తానొక పవర్ ఫుల్ ఆఫీసర్ అన్న విషయాన్ని ఎందుకు హీరో దాచి పెడతాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని థియేటర్లలో చూసేదాకా ఆగాల్సిందే. అయితే సినిమా స్టోరీ మొత్తం పాప చుట్టూ తిరుగుతుంది. హీరో ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ అనేది ప్రస్తుతానికైతే రూమరే. అసలు విషయం మాత్రం థియేటర్లలోనే తేలుతుంది.

The Journey of Viswam | Gopichand | Sreenu Vaitla | TG Vishwa Prasad | People Media Factory - YouTube

డైరెక్టర్, హీరో ఇద్దరికీ విశ్వం ముఖ్యమే 

హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ ఇద్దరికీ హిట్ ఎప్పుడు పడిందో కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. అయినప్పటికీ గోపీచంద్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టువదలని విక్రమార్కుడిలా హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో హిట్ అనే మాటను ఎరుగని హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి విశ్వం మూవీతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.

విశ్వం సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, కావ్య థాపర్ కథానాయికగా నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 11న విశ్వంను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తోనే హైప్ పెంచింది. కానీ మూవీ రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీపై అటు హీరో, ఇటు డైరెక్టర్ లతో పాటు హీరోయిన్ కూడా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×