BigTV English
Advertisement

Bigg Boss Gautham :నేను రన్నరప్ అని తెలియగానే, చరణ్ అన్న నాతో చెప్పిన మాటలు

Bigg Boss Gautham :నేను రన్నరప్ అని తెలియగానే, చరణ్ అన్న నాతో చెప్పిన మాటలు

Bigg Boss Gautham : తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ కు విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా మొదటి సీజన్ తెలుగులో స్టార్ట్ అయినప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉండేవి. అయితే ఊహించని విధంగా ఆ షో కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తన వాక్చాతుర్యంతో ఆ షో ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు ఎన్టీఆర్. హోస్ట్ గా కూడా ఎన్టీఆర్ తన టాలెంట్ ను ప్రదర్శించాడు. బిగ్బాస్ యాజమాన్యం మొదటి సీజన్ కి అద్భుతమైన కంటెస్టెంట్లను తీసుకువచ్చింది. ప్రతి కంటెస్టెంట్ మాక్సిమం సాధారణ ప్రేక్షకులకి తెలిసినవాళ్లే. అయితే బిగ్బాస్ సీజన్ పెరుగుతున్న కొద్దీ తెలిసిన కంటెస్టెంట్లు కంటే తెలుసుకోవాల్సిన కంటెస్టెంట్ లు ఎక్కువ అయ్యారు అనేది వాస్తవం. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్లు కూడా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు. బిగ్బాస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి గుర్తింపును పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బిగ్బాస్ లో కంటెస్టెంట్ గా గెలిచిన వాళ్ళు కొన్ని ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా కూడా హాజరైన రోజులు ఉన్నాయి.


లాస్ట్ సీజన్ లో గౌతమ్ కృష్ణ అనే ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ కి వచ్చాడు. ఆ సీజన్ లో తనదైన గేమ్ తో చాలామందిని ఆకట్టుకున్నాడు. మళ్లీ గౌతమ్ కృష్ణ రీసెంట్ గా జరిగిన సీజన్ 8 లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే దాదాపు ఈ సీజన్లో గౌతమ్ కృష్ణ గెలుస్తాడు అని అందరికీ ఒక ఒపీనియన్ ఉండేది. కానీ నిఖిల్ బిగ్బాస్ విన్నర్ గా నిలిచారు. గౌతమ్ కృష్ణ రన్నరప్ గా మిగిలిపోయారు. ఈ షో కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే రన్నరప్ గా మిగిలిన గౌతం కృష్ణకు కొన్ని విలువైన మాటలను చరణ్ చెప్పారు. నేను బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పినప్పుడు గౌతమ్ విన్నర్ అవుతాడని అమ్మ నాతో చెప్పారు. మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్. బిగ్ బాస్ ఆవిడ చూస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : Despatch Movie : హద్దులు దాటిన ఫ్యామిలీ మ్యాన్ రొమాన్స్… ఏకిపారేస్తున్న నెటిజన్లు


ఈ విషయంలో గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశాడు. నేను లో ఫీల్ అవుతున్న టైంలో చరణ్ గారు నాకు ఈ మాట చెప్పడంతో చాలా హ్యాపీ అనిపించింది అంటూ తెలిపాడు. ఏం పర్వాలేదు నువ్వేం దిగులు చెందకు. నీకు ఒక మంచి గుర్తింపును సాధించుకున్నావు, అలానే నీకంటూ ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. లైఫ్ లో నువ్వు మంచి షైన్ అవుతావు అని రామ్ చరణ్ అన్న నాతో చెప్పిన మాటలు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటూ గౌతమ్ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఇక మరోవైపు నటుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రయత్నంలో ఉన్నాడు గౌతమ్ కృష్ణ. చాలామంది హీరోలు అయిన తర్వాత బిగ్ బాస్ కి వెళ్లారు. కానీ బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత హీరో అయ్యే అవకాశం గౌతమ్ కి ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related News

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Big Stories

×