Bigg Boss Telugu 9 Day 13 Episode: నాగార్జున వచ్చాడు. అందరి లెక్కలు తెల్చాడు. కంటెస్టెంట్స్ కి పేరు పేరు.. వారి ఆటను వివరించారు. వరస్ట్ ప్లెయర్స్ కి వార్నింగ్, సూపర్ ప్లేయర్లకు ప్రశంసలు ఇచ్చాడు. ఈ ఎపిసోడ్ రంగు పడుద్ది అంటూ అందరి రంగులు బయటపెట్టాడు. కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చౌదరి ఫెవరిజం బయటపెట్టాడు. వీడియో సహా ప్రూవ్ చేసి సంచాలక్ గా ఆమె తీర్పును ప్రశ్నించాడు. దీంతో అసలు గట్టు బయటపడింది. రంగుపడుద్ది టాస్క్ లో కెప్టెన్సీ కంటెండర్స్ గా భరణి, డిమోన్ పవన్, ఇమ్యాన్యుయేల్ లు పాల్గొన్నారు. ఎవరి షర్టుకి తక్కువ రంగు ఉంటే.. వారు కెప్టెన్. కానీ, భరణి గెలవాల్సిన గేమ్ ని.. రీతూ డిమోన్ కి ఇచ్చింది. ఫైనల్ గా పవన్ ని కెప్టెన్ కి ప్రకటించింది.
భరణికి స్వీట్ వార్నింగ్
కానీ, ఆమె తీర్పు తప్పని లెక్కలు సరి చేసి.. కెప్టెన్సీ రద్దు చేశారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో అన్ ఫెయిర్ తీర్పుకి సపోర్టు ఇచ్చి.. తప్పుదారి పట్టించిన ఓనర్స్ ప్రియ, శ్రీజలకు నాగ్ చీవాట్లు పెట్టారు. వారి తప్పును వారికే చూపించాడు. దీంతో ఫైనల్ గా క్లారిటీ లేకుండ గేమ్ ఆడుతున్న రీతూ, ప్రియ, శ్రీజ, డిమోన్ పవన్, పవన కళ్యాణ్ ల ఫోటోలకు రంగు పూసి ఆట మెరుగుపరుచుకోవాలని సూచించాడు. ఆ తర్వాత సంచాలక్ తీర్పు తప్పయినప్పుడు ప్రశ్నించాలని భరణిని హెచ్చరించాడు. నీ గేమ్ కరెక్ట్ అని తెలిసినప్పుడు ఎందుకు ప్రశ్నించకుండ.. మంచివాడిలా ఉందామనుకుంటున్నావా? నాగ్ ప్రశ్నించాడు. ఇక నుంచి ప్రశ్నిస్తూ నీ ఆట నువ్వు ఆడాలని సూచించాడు.
ఆ తర్వాత సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ గేమ్ ని ప్రశంసించాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ హౌజ్ ఉంటావా? వెళ్తావా? అని సూటిగా ప్రశ్నించాడు. బిగ్ బాస్ అనే దమ్ముంటే అని ప్రశ్నించావు.. నీకు ఎంత దమ్ముంది.. హౌజ్ నుంచి బయటకు వస్తావా? ఉంటావా? సూటిగా అడిగి.. హరీస్ యాటిట్యూడ్ కి చెక్ పెట్టాడు. కాల చక్రం టాస్క్ లో రీతూ అన్ ఫెయిర్ డెసిజన్ సమర్థిస్తున్న శ్రీజ నోరు మూయించాడు నాగార్జున. తూ తూ తూ తూ అంటూ నీ మాటలు ఆపమ్మ.. అసలు విషయం ఏంటీ? ఏం జరిగిందనే క్లారిటీ లేకుండా.. ప్రతి దాంట్లో దూరిపోకంటూ శ్రీజకి కౌంటరిచ్చాడు. ఆ తర్వాత తనూజ ఆటను మెరుగుపరుచుకోవాలని, నీ ఆట ఏంటో ఏం అర్థం కాలేదంటూ ఆమె సరి చేశారు.
ఇక కాలచక్రం టాస్క్ లో కళ్యాణ్.. తప్పు చేసిన దాన్ని సమర్ధించుకున్నాడు. కానీ, వీడియోతో నిజం బయటపెట్టి షాకిచ్చాడు నాగార్జున. ఇక ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేసి.. రేపు అదే కంటెండర్స్ కెప్టెన్సీ టాస్క్ పెట్టబోతున్నాడు. దీనికి రీతూ సంచాలక్. ఎపిసోడ్ అయిపోయే సరికి.. ఓనర్స్ అందరి ముఖాలకు రంగు పడింది. ఇక టెనెంట్స్ లో రీతూకు ముఖానికి రంగు వేశాడు. దీన్ని బట్టి కామనర్స్ తమ ఆట తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు హోస్ట్ నాగ్. ఆ తర్వాత.. ఈ వారం నుంచి టెనెంట్స్ ని ఓనర్స్ గా.. ఓనర్స్ ని టెనెంట్స్ ప్రకటించారు. సెలబ్రిటీలంతా ఫుల్ ఖుష్. ఇక టాస్క్ లో గెలిచి టెనెంట్స్ నుంచి ఓనర్స్ అయిన భరణి, రాము రాథోడ్.. ఓనర్స్ గానే కొనసాగనున్నారు.