BigTV English

Adithi Rao – Siddarth : అప్పుడే భర్తకు చుక్కలు చూపిస్తున్న అదితి.. కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Adithi Rao – Siddarth : అప్పుడే భర్తకు చుక్కలు చూపిస్తున్న అదితి.. కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Adithi Rao – Siddarth : స్టార్ హీరో హీరో సిద్దార్థ్, అదితి రావు హైదరి చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్న సంగతి తీసిందే. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూసారు.. ఇన్నాళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 16న వీళ్లిద్దరి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షం లో ప్రైవేట్ గా జరిగింది. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచి రిలేషన్ కొనసాగుతుంది.. అయితే ఒకరికి ఒకరు తెలియనట్లు ఉన్నారు. గత ఏడాది ఇద్దరు ఓపెన్ అయ్యారు. ఇక అప్పుడే పెళ్లి గురించి అనౌన్స్ చేశారు. రహస్యంగా ఒకరినొకరు డేటింగ్ చేసిన తర్వాత, సెప్టెంబర్ 16, 2024 న ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి..


అందరికీ షాక్ ఇస్తూ ఎటువంటి ఆడంబరాలు చెయ్యకుండా పెళ్లి చేసుకున్నారు. తెలంగాణ వనపర్తి లోని ఓ ఆలయం లో చాలా సింఫుల్ గా ఇరు కుటుంబ సభ్యులు, సన్నీహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఇక సిద్ధార్థ్, అదితి తమ వివాహానికి కొద్ది రోజుల ముందు వోగ్‌తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. వారు తమ గురించి పూర్తి చేయాల్సిన ‘టెల్ ది ట్రూత్’ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో వీరి రిలేషన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..

Siddharth's shocking comments on Atidhi Rao Hydari
Siddharth’s shocking comments on Atidhi Rao Hydari

ఈ క్రమంలో సిద్దార్థ్ ను ఆదితి ఉదయాన్నే మొదట ఏం చేస్తుందని అడిగినప్పుడు, ఆమె తన ఇష్టానుసారం, సమ్మతి లేకుండా తనను నిద్రలేపుతుందని ఆయన త్వరగా సమాధానం ఇచ్చారు. అయితే, సూర్యుడు ఉదయించినప్పుడు మేల్కోవాలని ఆదితి అన్నారు. అందుకే ఇది నాకు నచ్చలేదు. అయిష్టంగానే లేస్తాను. కానీ తాను ఎప్పుడూ పద్దతిగా ఒక టైం ప్రకారం ఉంటుంది. అదే తన పై ఇష్టాన్ని పెంచేలా చేసిందని సిద్దార్థ్ చెప్పడం విశేషం.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా బ్రో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పద్దతిగా ఈ జంట చాలా అందంగా ఉన్నారు.. ఆదితి తన వివాహ వేడుక రోజున బనారస్ టిష్యూ దుప్పట్టా తో చేతితో నేసిన మహేశ్వరి టిష్యూ లెహంగా ను ధరించాలని ఎంచుకుంది. ఈ దుస్తులు ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ హెరిటేజ్ టెక్స్‌టైల్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నారు. ఆదితి తన దుస్తులను సబ్యసాచి హెరిటేజ్ నగలతో సింపుల్ గా అందంగా అలంకరించుకుంది. అయితే, ఆమె భర్త సిద్ధార్థ్.. నేత పనితో తయారు చేసిన బనారస్ ధోతీ,పట్టు కుర్తా ధరించాడు. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్ వేసుకోండిలా.. ఇక వీరిద్దరూ వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని టాక్..


Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×