BigTV English

Bigg Boss Prerana : ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం.. బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్?

Bigg Boss Prerana : ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం.. బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్?

Bigg Boss Prerana : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా, ప్రస్తుతం 12 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. వీరిలో సీరియల్ యాక్టర్ ప్రేరణ కుంబం కూడా ఒకరు.. ఈమె మొదటి నుంచి యాక్టివ్ గా ఉంటూ నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ వస్తుంది. ఇక మూడో వారంలో కూడా ఆమె నామినేట్ అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమెకు ఇష్టమైన వ్యక్తి మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్నుమూసినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఆమెకు ఈ వార్త గురించి తెలిసే అవకాశం లేదు. అది ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ద్వారా తెలియబోతుందని అంటున్నారు.. ఈ వార్త తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఆ కార్యక్రమాలు అయ్యేవరకు బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపిస్తారా? లేదా సడెన్ ఎలిమినేషన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.. ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ప్రేరణ ఈ కారణంతో అర్ధాంతరంగా ఆటను ఆపేసి ఇంటికి వెళ్ళిపోతే అది ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా నిరాశను కలిగించే విషయం అవుతుంది.. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే ఈరోజు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Deep tragedy in Prerna's house.. Bigg Boss shocking decision?
Deep tragedy in Prerna’s house.. Bigg Boss shocking decision?

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లంతా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ కుటుంబ సభ్యుల గురించి తలచుకుంటూ బాధ పడుతుంటారు.. మొన్న శేఖర్ భాషా ఆ కారణంతోనే ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రేరణ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఇకపోతే మూడో వారం నామినేషన్స్ పై జానాల్లో ఆసక్తి మొదలైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటంతో ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది. విష్ణు ప్రియా, సీత, పృథ్వీ, ప్రేరణ, సోనియా, మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక ఉన్నారు. మరి వీరిలో ఎవరు పెట్టే సర్దుకొని వెళ్తారో తెలియాల్సి ఉంది.. ఇక ఈ వారం బిగ్ బాస్ నుంచి మణికంఠ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైల్డ్ కార్డు ద్వారా హాట్ బ్యూటీ గీతూ రాయల్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.. మరి దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రావొచ్చు… ఇక విన్నర్ అయ్యే అవకాశాలు నిఖిల్ లేదా యష్మీ అవ్వొచ్చు అని బయట టాక్ నడుస్తుంది.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×