Divi Vadthya : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దివి వాద్యా.. ఈమధ్య సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోగొడుతుంది. బుల్లితెరపై టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఈ షోలో తన అందం ఆటతీరుతో ప్రేక్షకులను కట్టి పడేసింది. మరోవైపు వెండితెరపై 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ మహర్షి చిత్రంలో చిన్న పాత్ర పోషించి వెండితెరకు పరిచయం అయ్యింది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
నాకు కాబోయే వాడికి అది ఉండాలి..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దివి సినిమాలతో బిజీ అయ్యింది. అంతేకాదు.. పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన విషయాన్ని బయట పెట్టింది. వైజాగ్ కు చెందిన అబ్బాయితో ఆమె ప్రేమలో పడిందని, ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పెద్దగా డేటింగ్, లవ్ పై ఇంట్రెస్ట్ లేదని తెల్చేసింది. కానీ కాబోయే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో పంచుకుంది. తనతో ఎంతో ఫ్రెండ్లీగా, ఎప్పుడు చిన్న పిల్లలా చూసుకునే వారంటే ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా దివి వాద్యను తన ఒళ్లో కూర్చొబెట్టుకొని లాలించే వారు కావాలని చెప్పుకొచ్చింది. అలాంటి క్వాలిటీస్ ఉన్న వారంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే ఆమె సోలో లైఫ్ ని గడుపుతుందని చెప్పేసింది.
Also Read : ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాలీవుడ్ విలన్..
దివి గురించి పూర్తి వివరాలు..
ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లోనే పుట్టిపెరిగింది. జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో ఎంబీఏ పూర్తి చేసి పట్టా పొందింది. ఆ తర్వాతన తనకు నటన, మోడలింగ్ పై ఉన్న ఆసక్తిని కనబరిచ్చింది.. 2017 లో దివి వాద్య మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. మోడలింగ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకొని సినిమా రంగంలోనూ అవకాశాలు అందుకుంది. ఈమె సినిమాల విషయానికొస్తే.. మహర్షి, ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, గాడ్ పాధర్, లంబసింగి, పుష్ప 2, డాకూ మహారాజ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది.. అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో మెరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో దివి ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలతో పాటు సినిమా విషయాల గురించి కూడా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. త్వరలోనే ఈ అమ్మడు కొత్త సినిమాని అనౌన్స్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం..