Family Stars Promo : బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని విషయాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్, హీరో సుడిగాలి సుదీర్ హోస్ట్గా చేస్తున్న షోలకు మంచి క్రేజ్ ఉంటుంది.. ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలు తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అంతేకాదు సుధీర్ తో కలిపే పులిహోర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే సుదీర్ షోలకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. సుధీర్ యాంకరింగ్ కి తెలుగు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. తాజాగా ఈయన పోస్ట్ గా చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షో ప్రోమో ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సాగిన ఎపిసోడ్ లా ఉందని ప్రోమోను చూస్తే అర్థమవుతుంది.. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఫ్రెండ్షిప్ డే స్పెషల్..
ఫ్యామిలీ స్టార్స్ ప్రోమోలో ఫ్రెండ్షిప్ డే ని గ్రాండ్ గా చేసినట్లు తెలుస్తుంది.. బిగ్‌బాస్ శ్రీసత్య, మణికంఠ, నైనిక, సింగర్ సాకేత్, విరాజిత, యాంకర్ నిఖిల్ ఈ ఎపిసోడ్‌లో తమ బెస్ట్ ఫ్రెండ్స్‌ని తీసుకొని వచ్చారు. ఇక సుధీర్‌కి తోడుగా ఎలాగూ యాంకర్ స్రవంతి, అషూరెడ్డి కూడా ఉన్నారు.. షోలో మొత్తం అందరు సుధీర్ ను టార్గెట్ చేసినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. షోలోకి ఎంట్రీ ఇవ్వగానే బిగ్ బాస్ మణికంఠ పంచుల వర్షం కురిపించారు. మణికంఠ వచ్చినప్పటి నుంచి నా జుట్టు చూస్తున్నారని సుధీర్ అడిగాడు. దీనికి అది ఒరిజినలా కాదా అని చూస్తున్నా అంటూ మణికంఠ చెప్పాడు. అమ్మ బాబోయే ఒరిజినల్ అండి బాబూ ఇది అని సుధీర్ బదులిచ్చాడు. అవునా నాది ఒరిజినల్‌యే అంటూ మణికంఠ సెటైర్ వేశాడు.. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ లో మణికంఠ విగ్గు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Also Read :ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాలీవుడ్ విలన్..
ఫ్రెండ్ కు శ్రీసత్య ఖరీదైన గిఫ్ట్..
స్పెషల్ డే కావడంతో ప్రోమో మొత్తం సరదాగ ఉంటుంది. షోకు వచ్చిన వాళ్లంతా సుధీర్ ను ఆడుకుంటారు. నైనికను కూడా వదలకుండా సుధీర్ నాన్ స్టాప్ పంచులు వేసాడు. ఇక బిగ్ బాస్ సత్య సై సినిమాలో పాటకి రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇది చూసి సుధీర్, నిఖిల్ కూడా స్టేజ్ మీదకి వచ్చి రెండు స్టెప్పులేశారు. నైనిక కూడా తన డ్యాన్స్‌తో అందరినీ ఫిదా చేసింది. ఇక ప్రోమో చివరిలో తమ ఫ్రెండ్స్‌కి అందరూ స్పెషల్ గిఫ్ట్‌లు ఇచ్చారు.. ఇది ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇక శ్రీసత్య తన బెస్ట్ ఫ్రెండ్ కు డైమండ్ రింగ్ ఇస్తుంది. అందరూ అవాక్కయ్యారు. డైమండ్ రింగ్ అంటూ తన ఫ్రెండ్ వేలికి తొడిగింది శ్రీసత్య. ఏంటి డైమండ్ రింగా అంటూ నోరెళ్లబెట్టింది అషూరెడ్డి.. మొత్తానికి ప్రోమో అయితే సందడిగా సాగింది. ఎపిసోడ్ ఇంకా బాగుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ ప్రోమో పై మీరు ఓ లుక్ వేసుకోండి.