E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో అలాంటి పని చేస్తే అంతే.. విన్ అవ్వడం కష్టం, స్మార్ట్‌గా తప్పించుకున్న పృథ్వి

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లో అలాంటి పని చేస్తే అంతే.. విన్ అవ్వడం కష్టం, స్మార్ట్‌గా తప్పించుకున్న పృథ్వి

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో ప్రారంభమయ్యి చాలాకాలమే అయ్యింది. ఇప్పటికే ఈ షో 7 సీజన్స్‌ను పూర్తిచేసుకొని 8వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే ప్రతీ సీజన్‌లో కామన్‌గా కొన్ని టాస్కులు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ 8లో జరిగిన ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్సే దీనికి ఉదాహరణ. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రతీ బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో కామన్‌గా మరొక విషయం కూడా జరిగింది. అదే కంటెస్టెంట్స్ హెయిర్ కట్. కేవలం రెండు బిగ్ బాస్ సీజన్స్‌లోనే కంటెస్టెంట్స్ హెయిర్ కట్ నుండి తప్పించుకున్నారు. అయితే ఈ హెయిర్ కట్ చుట్టూ ఏమైనా సెంటిమెంట్ ఉందేమో అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.

అప్పటినుండి ఇప్పటివరకు

ముందుగా బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునయన టాస్క్‌లో భాగంగా హెయిర్ కట్ చేసుకుంది. చాలాకాలం పాటు హౌస్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా తన జర్నీని కొనసాగించిన దీప్తి.. 10వ వారంలో ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ 3వ సీజన్‌లో శివజ్యోతి హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది. తన ఆటతీరు అందరికీ నచ్చినా కూడా ఫైనల్స్‌కు ఒకవారం ముందు ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ జుట్టుపై కత్తెర పడింది. అదే అలేఖ్య హారిక, అమ్మ రాజశేఖర్. వీరిద్దరూ హెయిర్ కట్ చేయించుకున్నందుకు చాలా బాధపడ్డారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే వీరిద్దరూ విన్నర్ అవ్వలేకపోయారు.

ఇదొక సెంటిమెంట్

బిగ్ బాస్ సీజన్ 6లో ఇతర కంటెస్టెంట్ చేసిన త్యాగం కోసం తాను కూడా తన జుట్టును త్యాగం చేసింది వాసంతి కృష్ణన్. తను 10వ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక తన హెయిర్ కట్ చేసుకుంది. టాప్ 5లోకి కూడా వెళ్లింది. కానీ టాప్ 4 కంటెస్టెంట్‌గా బయటికి రావాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు బిగ్ బాస్ రియాలిటీ షోలో హెయిర్ కట్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవ్వరూ విన్నర్ అవ్వలేదు. ఇది ప్రేక్షకుల దృష్టిలో ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది. హెయిర్ కట్ చేసుకున్నవారు చివరి వరకు ఉన్నా కూడా విన్నర్ అవ్వలేదంటే బిగ్ బాస్ సీజన్ 8లో అవినాష్ విన్నర్ అవ్వడం కూడా కష్టమేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ .. ఏడో వారం ఇద్దరు అవుట్ ?

పృథ్వి తప్పించుకున్నాడు

మామూలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ విన్నర్ అవ్వడం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే జరగలేదు. అలాగే బిగ్ బాస్ 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ విన్ అవ్వడం కష్టమే. పైగా తాజాగా ప్రైజ్ మనీ టాస్క్ కోసం హెయిర్ కట్ చేయించుకున్నాడు అవినాష్. కానీ పృథ్వి మాత్రం తన జుట్టు, గడ్డం తీసేయడం అసాధ్యం అని టాస్క్ ఆడకుండా తప్పించుకున్నాడు. సెంటిమెంట్ ప్రకారం చూస్తే అవినాష్ విన్నర్ అవ్వడం ఇక కష్టమే అని అనిపిస్తోంది. ఇక పృథ్వి కూడా తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే వెంటనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోక తప్పదు. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో పృథ్వి ఎలిమినేట్ అయినట్టు సమాచారం.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×