BigTV English

BB Telugu 8: ఓటింగ్ లో తారుమారు.. మొదటి స్థానంలో ఎవరంటే..?

BB Telugu 8: ఓటింగ్ లో తారుమారు.. మొదటి స్థానంలో ఎవరంటే..?

BB Telugu 8:బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పూర్తి కావడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 15వ తేదీన గ్రాండ్ గా ఫినాలే ఈవెంట్ నిర్వహించి, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ను ప్రకటించనున్నారు నిర్వాహకులు. ఇందుకోసం సోమవారం అనగా డిసెంబర్ 9 నుంచి బిగ్ బాస్ ఫైనల్ వీక్ కి సంబంధించి ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. గత వారమే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. అందులో భాగంగానే విష్ణు ప్రియ, రోహిణి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం టైటిల్ కోసం ఐదు మంది సభ్యులు టాప్ ఫైవ్ కి చేరుకొని పోటీ పడుతున్నారు. వారిలో నిఖిల్, గౌతమ్,అవినాష్,నబీల్, ప్రేరణ.. ఈ ఐదు మందిలో ఒకరు విజేతగా నిలవనున్నారు.


ఇకపోతే ఓటింగ్ ప్రారంభం అవ్వగా ఈ ఓటింగ్లో చివరివారానికి సంబంధించి ఊహించని ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకీ లెక్కలు తారుమారవుతుండడంతో అటు నిర్వాహకులు కూడా కన్ఫ్యూజ్ లో పడ్డారని చెప్పవచ్చు. ప్రస్తుతం టాప్ 5 ఫైనలిస్ట్ స్థానాలలో మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుపొంది మొదటి ఫైనలిస్ట్ గా అవినాష్ నిలిచి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్స్ కి చేరుకున్నారు. ఇక రెండవ ఫైనలిస్ట్ గా నిఖిల్, మూడవ ఫైనలిస్ట్ గా గౌతమ్, నాలుగో ఫైనలిస్ట్ గా ప్రేరణ, ఐదో ఫైనలిస్ట్ గా నబీల్ నిలిచారు.

ఇకపోతే తాజాగా వెలువడిన ఓటింగ్ ప్రకారం ఈ ఓటింగ్ లో మొదటి రోజు గౌతమ్ స్వల్ప ఓట్ల తేడాతో నిఖిల్ కంటే మొదటి స్థానంలో నిలువగా.. అయితే రెండో రోజు ఓటింగ్ వచ్చే సరికి గౌతమ్ ను కాస్త దాటేసి నిఖిల్ మొదటి స్థానానికి వచ్చారు. ప్రస్తుతం వీరి ఓట్ల లో తేడా ఉన్నా.. ఓటింగ్ శాతంలో మాత్రం ఎటువంటి తేడా కనిపించడం లేదు. నిఖిల్ కి 33% ఓటింగ్ తో 47,917 ఓట్లు రాగా.. గౌతమ్ కి అదే 33% ఓటింగ్ తో 47,671 ఓట్లు వచ్చాయి. ఈ తేడాతోనే నిఖిల్ మొదటి స్థానంలో, గౌతమ్ రెండవ స్థానంలో నిలిచారు. ఇక మొదటి రోజు కంటే రెండవ రోజు ఓటింగ్ కాస్త పెరిగింది. మొదటి రోజు 31 శాతం ఉన్న ఓటింగ్ రెండో రోజు 33 శాతానికి చేరుకుంది. మరోవైపు అవినాష్ కి మొదటి రోజు ఐదు శాతం ఓటింగ్ రాగా రెండో రోజు కూడా అదే ఓటింగ్ శాతం కొనసాగింది. కానీ ఓట్లు మాత్రం పెరిగాయి. అయితే ఇప్పుడు అవినాష్ కంటే ప్రేరణ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇక నాల్గవ స్థానంలో నబీల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదవ స్థానానికి అవినాష్ పడిపోయారు. ఇక ఈవారం ఎలిమినేషన్స్ లో భాగంగా రూ.10 లక్షల ప్రైజ్ మనీతో ఆయన బయటికి వెళ్ళబోతున్నారని సమాచారం.ఏది ఏమైనా ఓటింగ్లో మార్పులు భారీగా జరుగుతున్నాయి. ఇక ఎట్టకేలకు నిఖిల్ కు ఈ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఇవ్వబోతున్నట్లు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×