Manchu Family Issue: ముందుగా మోహన్ బాబు, విష్ణు అనుచరులు మంచు మనోజ్‌పై దాడి చేశారు అనే విషయంతోనే వీరి కుటుంబ వివాదం బయటికొచ్చింది. తన తండ్రి అనుచరలు తనను దాడి చేశారని గాయాలపాలయిన మనోజ్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో వీరి ఇంట్లో జరిగిన గొడవ బయటికొచ్చింది. అలా అలా ఈ గొడవ పెద్దగా మారి ప్రస్తుతం ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అయ్యింది. దాడి జరిగిన తరువాతి రోజు పోలీసులను కలిసి స్వయంగా ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. అలా ఫిర్యాదు చేసిన మూడు రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని సమాచారం.
నిందితుడి అరెస్ట్
ఇంట్లో మంచు మనోజ్‌పై దాడి జరిగినప్పుడు అక్కడ మోహన్ బాబు, మంచు విష్ణు అనుచరులు చాలామంది ఉన్నారు. అందులో ముందుగా కిరణ్ అనే మంచు విష్ణు అనుచరుడు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు మనోజ్. దీంతో కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వినయ్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా ఫిర్యాదులో ఉంది. కానీ ఇప్పటికీ మనోజ్‌పై దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా వినయ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందలేదు. తను పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటినుండి వినయ్ రెడ్డి కోసం పహాడి షరీఫ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడు.. నటుడి కామెంట్స్
పరారీ వెనుక ప్లాన్
ముందుగా మంచు మనోజ్ (Manchu Manoj)పై జరిగిన దాడి విషయంలో వినయ్ రెడ్డి పేరే బయటికొచ్చింది. తను మోహన్ బాబు కుటుంబ వ్యవహారాలతో పాటు బిజినెస్ విషయాలు కూడా చూసుకుంటాడని సమాచారం. తాజాగా ప్రెస్‌తో మాట్లాడిన మనోజ్.. వినయ్ వల్లే తను తన కుటుంబానికి దూరమయ్యాయని ఆరోపణలు చేశాడు. వినయ్ తనపై దాడి చేశాడని తెలిపాడు. అయినా కూడా ఇప్పటివరకు వినయ్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ తెలియదు. దీంతో వినయ్‌ను మోహన్ బాబు లేదా విష్ణునే దాచేసి ఉంటారని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇంకా మోహన్ బాబు (Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu)తో పోలీసులు మాట్లాడలేదు.
ఆసుపత్రికి రాలేదు
కుటుంబ కలహాల వల్ల మోహన్ బాబుకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అందుకే తనను అర్థరాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఇంకా మోహన్ బాబు ఆసుపత్రిలోనే ఉన్నారు. తనతో పాటు మంచు విష్ణు కూడా అక్కడే ఉన్నాడు. తనను కలవడానికి మంచు మనోజ్ కూడా అక్కడికి వస్తాడని అందరూ అనుకున్నారు కానీ తను రావడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకొని తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నా కూడా తనను చూడడానికి మనోజ్ ఇష్టపడడం లేదని సమాచారం. మంచు విష్ణు మాత్రం తన తమ్ముడితో రాజీపడడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ ప్రెస్ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు.