BigTV English

Bigg Boss 8 Telugu: మళ్లీ వచ్చిన గంగవ్వ.. బిగ్ బాస్ ఆడించిన ఆటలో మొదటి గెలుపు తనదే

Bigg Boss 8 Telugu: మళ్లీ వచ్చిన గంగవ్వ.. బిగ్ బాస్ ఆడించిన ఆటలో మొదటి గెలుపు తనదే

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సందడి మొదలయ్యింది. తాజాగా నైనికా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన తర్వాత హౌస్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందుకే వారిని ఢీకొట్టడం కోసం మరో ఎనిమిది మందిని రంగంలోకి దించారు బిగ్ బాస్. ఇంతకు ముందు సీజన్స్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసినవారే మరోసారి బిగ్ బాస్ సీజన్ 8లో కూడా కంటెస్టెంట్స్‌గా వచ్చారు. ఇప్పటికే హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, నయని పావని, మెహబూబ్ దిల్‌సే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సభ్యులుగా ఎంటర్ అవ్వగా.. గంగవ్వ కూడా మరోసారి కంటెస్టెంట్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యింది.


ఆర్థిక సాయం

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చింది గంగవ్వ. సోషల్ మీడియా అంటే, టెక్నాలజీ అంటే ఏంటో తెలియని గంగవ్వ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యింది. అయినా తన సమస్యలు తీరలేదు. కానీ బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత తన కష్టాలు తీరిపోయాయి. అప్పుల బాధ నుండి బయటపడింది, ఇల్లు కట్టుకుంది. దానికి బిగ్ బాస్ మేకర్స్‌తో పాటు నాగార్జున కూడా ఆర్థికంగా సాయం చేశారు. కానీ అప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మధ్యలో నుండి ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చి చివరివరకు ఎంటర్‌టైన్ చేస్తానని మాటిచ్చింది గంగవ్వ. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో నబీల్ చాలా బాగా ఆడుతున్నాడని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది.


Also Read: టచ్ చేస్తే నామినేషన్.. పాత కంటెస్టెంట్స్‌ను ఫూల్స్ చేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

ఇమిటేట్ చేస్తూ ఎంటర్‌టైన్మెంట్

గంగవ్వతో పాటు చివరి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టాడు అవినాష్. కామెడియన్‌గా వచ్చి ఇంతకు ముందు సీజన్‌లో కూడా ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్‌లో కత్తి నబీల్ అని, సుత్తి యష్మీ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా తనతో పాటు బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా వచ్చిన శ్రీముఖి.. తనకు ఒక సర్‌ప్రైజ్ వీడియో మెసేజ్‌ను పంపింది. ఒకప్పుడు బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడు అవినాష్ బ్యాచిలర్ అని, ఇప్పుడు పెళ్లయ్యి ఫ్యామిలీ ఉందని గుర్తుచేసింది. ఇక హౌస్‌లోకి వెళ్లేముందు నబీల్, విష్ణుప్రియా, మణికంఠను ఇమిటేట్ చేసి అప్పుడే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టాడు.

గెలిచి చూపించింది

బిగ్ బాస్ సీజన్ 8లో గంగవ్వ, అవినాష్ కలిసి రాయల్స్ టీమ్‌లోకి చివరి కంటెస్టెంట్స్‌గా వచ్చారు. అయితే వారు కూడా పాత కంటెస్టెంట్స్‌తో ఒక టాస్క్ ఆడాల్సి వచ్చింది. ఈ టాస్కులో గెలిచిన వారికి ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ తెలిపారు. అసలు గంగవ్వ టాస్కుల్లో ఎలా ఆడుతుందో అనుకున్న ప్రేక్షకులకు ఈ టాస్క్‌తోనే గట్టి సమాధానం ఇచ్చింది గంగవ్వ. అవినాష్, గంగవ్వ కలిసి టాస్క్ గెలిచి ఇమ్యూనిటీ సంపాదించారు. దీంతో పాత కంటెస్టెంట్స్ ‘ఓజీ’ టీమ్ మరోసారి ఓడిపోయింది. ప్రస్తుతం ‘రాయల్స్’ టీమ్ దగ్గరే నామినేషన్ షీల్డ్, ఇమ్యూనిటీ రెండూ ఉన్నాయి. ‘ఓజీ’ టీమ్‌కు మాత్రం బెడ్‌రూమ్, రేషన్ కంట్రోల్ లభించింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×