BigTV English

Bigg Boss 8 Telugu: ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న గౌతమ్.. ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ పక్కా

Bigg Boss 8 Telugu: ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న గౌతమ్.. ఎక్స్‌ట్రా రెమ్యునరేషన్ పక్కా

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి మరోసారి ఎంటర్ అయ్యాడు గౌతమ్. మునుపటి సీజన్స్‌లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారిలో అందరూ మునుపటి సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారే. ఇక గౌతమ్ కూడా సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించాడు. ఆ సీజన్‌లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లి అశ్వద్ధామ 2.0గా తిరిగొచ్చి కొన్నాళ్ల పాటు ఎంటర్‌టైన్ చేశాడు. కానీ ఫైనల్స్ వరకు ఉండలేకపోయాడు. ఇక బిగ్ బాస్ 8లో గౌతమ్ పరిస్థితి అలాగే ఉంది. ఈసారి తృటిలో ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడంతో మరో రెండు వారాలు పాటు హౌస్‌లోనే ఉంటాడు. దీంతో రెమ్యునరేషన్‌ విషయంలో అప్పటివరకు తనకు ఢోకా లేదు.


ఎక్కడ తప్పు చేశాను?

బిగ్ బాస్ 8లో తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో మణికంఠ, గౌతమ్ చివరికి డేంజర్ జోన్‌ వరకు వచ్చారు. అయితే అక్కడ మణికంఠనే ఎలిమినేట్ అయిపోతాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఎలిమినేట్ అవుతావా లేదా అని ఆలోచించుకునే అవకాశాన్ని మణికే ఇచ్చారు నాగార్జున. దాంతో తన వల్ల కావడం లేదని హౌస్ నుండి వెళ్లిపోతానని డిసైడ్ అయ్యాడు మణికంఠ. మణి ఎలిమినేట్ అవుతాడని ప్రకటించిన తర్వాత ఓటింగ్ విషయంలో గౌతమ్ లాస్ట్‌లో ఉన్నాడని, అసలైతే తను ఎలిమినేట్ అవ్వాల్సింది అని ప్రకటించారు నాగ్. దీంతో గౌతమ్ షాకయ్యాడు. అసలు తాను ఎక్కడ తప్పు చేశానా అని ఫీల్ అయ్యాడు. తాము వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చాము కాబట్టి ముందు నుండి ఉన్న కంటెస్టెంట్స్‌కే ఓట్లు వేయడానికి ప్రిఫర్ చేస్తారని హరితేజ చెప్పుకొచ్చింది.


Also Read: బిగ్ బాస్ నుంచి మణికంఠ అవుట్.. ఎంత సంపాదించాడంటే?

మెగా చీఫ్ సేఫ్

ఇక బిగ్ బాస్ 8లోకి రీఎంట్రీ ఇవ్వడానికి గౌతమ్ చాలానే రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వారానికి రూ.1 లక్ష రెమ్యునరేషన్ అగ్రిమెంట్‌తో బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టాడట గౌతమ్. ఇప్పటికే గౌతమ్ హౌస్‌లోకి అడుగుపెట్టి రెండు వారాలు అయ్యింది. తను ఈవారం ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి కచ్చితంగా మరో రెండు వారాలు హౌస్‌లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఈవారం గౌతమ్ మెగా చీఫ్‌గా గెలిచాడు. మెగా చీఫ్ స్థానంలో ఉండేవారిని కంటెస్టెంట్స్ నామినేట్ చేయకూడదు కాబట్టి అలా ఒకవారం ఎలిమినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. మరోవారం కూడా దాదాపుగా తను హౌస్‌లోనే ఉండే ఛాన్స్ ఉంది. అలా ఈ రెండువారాలకు తన రెమ్యునరేషన్ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అన్ని లాభాలే

మరో రెండు వారాలు గౌతమ్ హౌస్‌లో ఉంటే తనకు మరో రూ.2 లక్షలు రెమ్యునరేషన్ వచ్చినట్టే. అలా గౌతమ్ మొత్తంగా రూ.4 లక్షల రెమ్యునరేషన్ సేఫ్‌గా వెనకేసుకుంటాడు. మొత్తానికి బిగ్ బాస్ 8లోకి వచ్చినందుకు గౌతమ్‌కు చాలానే లాభాలు ఉన్నాయి. బిగ్ బాస్ 7 నుండి బయటికి వెళ్లిన తర్వాత తనకు హీరోగా ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్‌గా రావడం వల్ల తను హీరోగా నటించిన సినిమాలకు కావాల్సినంత ప్రమోషన్ జరుగుతుంది. దాంతో పాటు ఈ షో వల్ల తనకు రెమ్యునరేషన్ కూడా వస్తుంది. అలా ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లొచ్చిన గౌతమ్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం బిగ్ బాస్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×