BigTV English

Bigg Boss: ఆసక్తికరంగా మారిన ఏజ్ గ్యాప్.. గంగవ్వ కంటే నాగార్జునే పెద్దోడా..?

Bigg Boss: ఆసక్తికరంగా మారిన ఏజ్ గ్యాప్.. గంగవ్వ కంటే నాగార్జునే పెద్దోడా..?

Bigg Boss.. తెలంగాణకు చెందిన గంగవ్వ (Gangavva ) యూట్యూబర్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4) లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె ఇప్పుడు మళ్లీ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె అక్కడ నాలుగు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ వాతావరణానికి ఇమడలేక బయటకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సీజన్ 8లో కంటెస్టెంట్గా అడుగు పెట్టింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే అవినాష్ తో కలిసి ఒక గేమ్ చాలా అద్భుతంగా ఆడింది. అబ్బో అవ్వ పర్వాలేదే.. ఈ వయసులో కూడా ఇరగదీసిందే అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేశారు.


గేమ్స్ ఆడకపోయినా అందలం ఎక్కిస్తున్న కంటెస్టెంట్స్..

అయితే ఆ తర్వాత నుంచి ఆమె పెద్దగా గేమ్స్ ఆడడం ఎవరూ చూడలేదని చెప్పాలి. కంటెస్టెంట్స్ తో అప్పుడప్పుడు సరదా ముచ్చట్లు ఆడడం మాత్రమే చూసాం. అయితే మొదటి రోజు ఆమెలో కనిపించిన జోష్ మళ్లీ కనిపించలేదు. హౌస్ మేట్స్ కూడా వయసులో పెద్దావిడ కాబట్టే ఆమెతో టాస్కులు ఆడించి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెను సైలెంట్ గా ఒకపక్క కూర్చో పెడుతున్నారు. టాస్క్లలో ఆమెను పక్కన పెట్టినా మెగా చీఫ్ గా ఆమెకు బాధ్యతలు చేపట్టి ఆమె వయసుకి గౌరవాన్ని ఇచ్చారని చెప్పవచ్చు.


గంగవ్వ కంటే నాగర్జున అన్నేళ్లు పెద్దోడా..

సాధారణంగా బిగ్ బాస్ ఇచ్చే గేమ్ లు ఆడి టైటిల్ విన్నర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే గంగవ్వ మాత్రం అలా చేయడం లేదు. మరి అలాంటప్పుడు ఈమెను ఎందుకు బిగ్ బాస్ కి పిలిచారు..? ఈమె వల్ల ఎవరికి ఉపయోగం..? అటు ఎంటర్టైన్మెంట్ కూడా ఏమి ఇవ్వట్లేదు కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.ఇకపోతే ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో గంగవ్వ వయసు గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే గంగవ్వ వయసు కేవలం 62 యేళ్లు మాత్రమే అని, కానీ ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున (Nagarjuna )వయసు 65 ఏళ్లని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే గంగవ్వ కంటే నాగార్జున మూడేళ్లు వయసులో పెద్ద. అయితే నాగార్జున కూడా అందరిలాగే గంగవ్వను అవ్వ అని పిలవడం చాలా కామెడీగా అనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఏదో అమ్మ వయసు ఉన్న ఆమె లాగా ట్రీట్ చేస్తున్నాడు నాగార్జున అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఇకపోతే సీజన్ 4 నుండి గంగవ్వ బయటకు వచ్చిన తర్వాత నాగార్జున ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆమెకు అలాంటి సహాయం ఏదైనా చేయొచ్చు కదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా గంగవ్వ – నాగార్జున ఏజ్ గ్యాప్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Big Stories

×