BigTV English
Advertisement

Himaja : క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్.. 3 సార్లు అనుభవించానంటూ..?

Himaja : క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్.. 3 సార్లు అనుభవించానంటూ..?

Himaja : సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా ప్రథమంగా వినిపించే పేరు క్యాస్టింగ్ కౌచ్. ముఖ్యంగా ఇండస్ట్రీలో అవకాశం రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటి హిమజ(Himaja) క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హిమజ విషయానికి వస్తే… సినిమాలపై ఇష్టంతోనే హైదరాబాదులో అడుగుపెట్టిన ఈమె, మొదట బుల్లితెరపై కెరియర్ ప్రారంభించింది. అలా ‘స్వయంవరం’ అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన హిమజ, ఆ తర్వాత ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్ తో మంచి గుర్తింపు కూడా అందుకుంది


హిమజ కెరియర్..

సీరియల్ ద్వారా వచ్చిన ఇమేజ్ తో ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు లభించాయి. అలా స్పైడర్, నేను శైలజ, శివ, ఉన్నది ఒకటే జీవితం, వినయ విధేయ రామ, శతమానంభవతి, వరుడు కావలెను వంటి పలు చిత్రాలలో నటించి నటిగా కూడా మంచి పేరు దక్కించుకుంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది. దీంతో హిమజ మరింత పాపులారిటీ అందుకుంది. ఇకపోతే హిమజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా ‘జ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా.. అందులో ప్రతాప్ రాజు అనే వ్యక్తి హీరోగా నటించారు. ఇక ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యింది. ఇకపోతే వరుస ప్రయోగాలు చేస్తూ సినీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి ఆశ్చర్యపరిచింది.


క్యాస్టింగ్ కౌచ్ పై హిమజ కామెంట్స్..

హిమజ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో నేను ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను. ఎన్నో ఎత్తు పల్లాలను చూశాను. ఇక తట్టుకోలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనిపించింది. ఆ తాలూకు ప్రభావాలు అప్పుడప్పుడు భయాన్ని కూడా కలిగిస్తాయి అంటూ హిమజా తెలిపారు. ఇక అలాంటి సమయంలోనే బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది అని తెలిపింది హిమజ.
ఇకపోతే బిగ్ బాస్ లో అవకాశం రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా? అనే ప్రశ్నకి కూడా సమాధానం తెలిపింది.. హిమజ మాట్లాడుతూ..”ఇటీవల కాలంలో కమిట్మెంట్ అంటేనే అర్థాలు మారిపోతున్నాయి. అసలు కమిట్మెంట్ అంటే ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు. బిగ్ బాస్ లో మాత్రం అలాంటిది అస్సలు చేయరు. ఎందుకంటే బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యి ముందుకు వస్తున్నారంటే.. వాళ్ళందరూ స్ఫూర్తిగా ఉండే వాళ్లు. ఏదైనా సరే ముఖం మీద మాట్లాడే వారు.. రఫ్ అండ్ టఫ్ గా ఉండే వాళ్ళను మాత్రమే బిగ్ బాస్ లోకి తీసుకుంటారు. అలాంటి వాళ్లతో ఇలాంటి కమిట్మెంట్ విషయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఇక బిగ్ బాస్ కి కూడా నేను మూడుసార్లు ఇంటర్వ్యూ ఎదుర్కొన్నాను. అప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. నా ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. వారు కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు లేవు. ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడే తత్వం ఉంటేనే హౌస్ లోకి తీసుకుంటారు” అంటూ చెప్పింది. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి మాటలకు తావు లేదని తెలిపింది హిమజ.

Related News

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Big Stories

×