Game Changer Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అందులో నటించిన ఇద్దరు హీరోలను పాన్ ఇండియా స్టార్లను చేసింది. అందులో ఒక హీరోగా నటించిన రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్ చేసింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా రాలేదు. అందులో ఈ హీరో ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంతా తన తరువాతి సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో తర్వాత చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ అనే మూవీలో చిన్న క్యామియో చేశాడు చరణ్. కానీ అది అంతగా హిట్ అవ్వలేదు. అందుకే ప్రస్తుతం ప్రేక్షకుల ఎదురుచూపులు అన్నీ ‘గేమ్ ఛేంజర్’పైనే ఉన్నాయి.
గేమ్ ఛేంజర్
తమిళ ఇండస్ట్రీలో దర్శకుడు శంకర్‌కు విపరీతమైన పాపులారిటీ ఉంది. పాన్ ఇండియా అనే ట్యాగ్ లేని సమయంలోనే పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి అందరికీ దగ్గరయ్యాడు శంకర్ (Shankar). అలాంటి శంకర్‌తో రామ్ చరణ్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసుకున్నారు. కానీ ఈ సినిమా మొదలయినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అసలు ఈ మూవీ ఆగిపోయిందేమో అన్న అనుమానాలు కూడా వచ్చాయి. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ ముందుకు కదిలింది. మిగతా సినిమాలతో సంక్రాంతి రేసులో నిలబడింది. ఇప్పుడు ఈ మూవీపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో బుక్ మై షో చూస్తే తెలిసిపోతోంది.
Also Read: థండర్ కోసం వైల్డ్ ఫైర్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
సీనియర్ హీరోలకు మించి
బుక్ మై షోలో సంక్రాంతి సినిమాల సందడి మొదలయ్యింది. 2025 సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో పాటు వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, అజిత్ ‘విడా ముయర్చి’ సినిమాలు కూడా ఉన్నాయి. అందరూ రామ్ చరణ్ కంటే సీనియర్ హీరోలే అయినా కూడా వారందరినీ వెనక్కి నెట్టి మరీ ‘గేమ్ ఛేంజర్’కు బుక్ మై షోలో ఎక్కువ ఇంట్రెస్ట్స్ వచ్చాయి. దీంతో రామ్ చరణ్‌కు పెరిగిపోయిన పాపులారిటీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులంతా ఎంతలా ఎదురుచూస్తున్నారో ఈ ఇంట్రెస్ట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి 2025 జనవరి 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.
రికార్డులు బ్రేక్
బుక్ మై షోలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు ఇప్పటివరకు 280.5 వేల ఇంట్రెస్ట్స్ వచ్చాయి. ఇంట్రెస్ట్స్ లిస్ట్‌లో ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఉంది. ఈ మూవీకి మొత్తం 146.1 వేల ఇంట్రెస్ట్స్ వచ్చాయి. బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’కు 127.8 వేల ఇంట్రెస్ట్స్ వచ్చాయి. ఇక తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల అవుతుందని ఊహిస్తున్న ‘విడా ముయర్చి’ సినిమా చూడడానికి 45 వేల మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ బుక్ మై షో ఇంట్రెస్ట్స్‌ను రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా గర్వంగా షేర్ చేసుకుంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటివరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నారు.