Gundeninda GudiGantalu Today episode june 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని అంటుంది. ఏమైంది అని బాలు టెన్షన్ పడతాడు. ఆటో దొరికితే గుడికొస్తానని మొక్కుకున్నాను.. భర్త పక్కన లేకుండా భార్య గుడికి వెళ్తే అది అసంపూర్ణంగానే ఉంటుంది. మీనాతో వాదించలేక బాలు మీనా తో గుడికి వెళ్తాడు. అక్కడ అంతా హడావిడి చూసి బాలుకి ఏం జరుగుతుందో అర్థం కాదు.. అయితే చివరికి ఆ కారు మీనా నీకోసం గిఫ్ట్ గా ఇచ్చిందని అక్కడ వాళ్ళు చెప్పడంతో బాలు సంతోషంతో షాక్ అవుతాడు.. ఇదేంటి మీనా ఇంత డబ్బులు నీకు ఎలా వచ్చాయని బాలు అడుగుతాడు.. మీరు నా కోసం ఎన్నో చేశారు మీ కోసం నేను ఆ మాత్రం కూడా చేయనా అని మీనా అంటుంది.. పూల మీద డబ్బుల్ని ఇలా కారు కొనడానికి ఉపయోగించాను అని మీనా అనగానే బాలు ఎమోషనల్ అవుతాడు. ఇక మొత్తానికి పూజ అయిపోయిన తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి కారులో బయలుదేరుతారు. ఇదంతా ఎందుకు చేశావు అని బాలు అడిగితే మీరు నా కోసం ఎందుకు పూల కొట్టు పెట్టించారు అని నేను అంటుంది. మీరు నాకోసం ఇంత చేశారు కదా.. నీకోసం నేను ఈ మాత్రం కూడా చేయనా అని మీనా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతిని రోహిణి చీరతో బుట్టలో పడేసుకుంటుంది. అయితే బాలు మీనా వచ్చి సర్ప్రైజ్ అని అందరినీ బయటకు తీసుకొని వస్తారు. కారును చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఎందుకు ఏమైంది ఈ కారు ఎలా వచ్చింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే నా భార్య నా కోసం కొనిచ్చిందని బాలు గొప్పగా చెప్తాడు. దీని రేటు ఎంతో అని ప్రభావతి ఆశ్చర్యంగా అడుగుతుంది.. దాదాపు పది లక్షలు ఉంటుందని బాలు అనగానే మనోజ్ ఇది సెకండ్ హ్యాండ్ కార్ల ఉంది ఏ రెండు మూడు లక్షల ఉంటది లే అనేసి అంటాడు.. అవును ఆ మూడు లక్షలు మా ఆవిడ పూలమ్మగా వచ్చిన డబ్బులతో నాకు గిఫ్ట్ ఇచ్చింది అని అంటాడు.
మా ఆవిడ అదన్న ఇచ్చింది మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు ఏ పది లక్షలు కారు ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వలేదు అని బాలు రోహిణి అడ్డంగా ఇరికిస్తాడు. అయితే వీడికి ఇలాంటి సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవాల్సిన అవసరం నా ఏముంది అని ప్రభావతి అంటుంది. నా కొడుకు కొత్త కారే కొంటాడు అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ నాన్న అమ్మ కూడా కుళ్ళుకుంటుంది అని బాలు అంటాడు. సత్యం కూడా మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా అని అంటాడు. కానీ మీనా ను సత్యం నువ్వు చేసింది చాలా మంచి పని అమ్మ నేను చేయలేదు నువ్వు చేసావు నాకు చాలా సంతోషంగా ఉంది అని పొగడ్తల వర్షం కురిపిస్తాడు..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
మౌనిక వ్రతం అయిపోయింది ఈయనతో కలిసి భోజనం చేయాలని ఎదురు చూస్తున్నానని సువర్ణతో అంటుంది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ మౌనికను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. ఇంకా భోజనం చేయకపోతే ఎలాగాని ప్రేమగా నటిస్తాడు. అయితే ప్లేట్లో భోజనం తీసుకువచ్చి పెడతాను రా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి ప్లేట్లో బిర్యానీ పెట్టి బలవంతంగా తినమని మౌనికను ఇబ్బంది పెడతాడు. అయితే సువర్ణ వచ్చి నువ్వు మనిషివేనారా నా కడుపుని ఎలా పుట్టావురా అని తిట్టి మౌనికని తీసుకెళ్తుంది. కారు కొన్న విషయాన్ని బాలు మౌనికతో చెప్తాడు. మౌనిక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే మీనా శివ గురించి ఏదో చెప్పబోతుంటే వింటూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. రవిని సత్యం ఫ్యామిలీ నుంచి విడగొట్టాలని శోభా ప్లాన్ చేస్తుంది.