BigTV English

Toddler Shoots Mother: బాయ్‌ఫ్రెండ్‌తో తల్లి నిద్రిస్తుండగా తుపాకీతో కాల్చిన పిల్లాడు.. ప్రమాదవశాత్తు జరిగిందన్న పోలీసులు!

Toddler Shoots Mother: బాయ్‌ఫ్రెండ్‌తో తల్లి నిద్రిస్తుండగా తుపాకీతో కాల్చిన పిల్లాడు.. ప్రమాదవశాత్తు జరిగిందన్న పోలీసులు!

Toddler Shoots Mother| చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఆడుకుంటూ తెలిసి తెలియక చేసిన పనుల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఒక యువతి తన ప్రియుడితో గదిలో నిద్రపోతూ ఉండగా.. ఆమె కొడుకు నిద్రపోతున్న తల్లి వద్దకు వెళ్లి తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో యువతి మరణించింది. ఈ ఘటనలో అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది.


అమెరికాలోని ఉత్తర్ క్యాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో నగరం నివసించే జెస్సినియా మీనా అనే 22 ఏళ్ల యువతికి ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద కొడుకు వయసు 2.5 ఏళ్లు కాగా.. మరో 8 నెలల పాప ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడిపోయి మరో 18 ఏళ్ల కుర్రాడిని ప్రేమించింది. అతని పేరు ఆండ్రూ శాంచెజ్. నెల రోజుల క్రితం శాంచెజ్ కూడా తన ప్రియురాలి ఇంట్లోనే నివాసం ఉండడానికి వచ్చేశాడు.

అలా ఇద్దరు ప్రేమికులు సహజీవనం చేస్తుండగా.. ఇటీవల ఇంట్లో తుపాకీ కాల్పులు వినిపించాయి. దీంతో పొరుగింటి వారు జెస్సినియా ఇంటి తలుపులు కొట్టారు. శాంచెజ్ తలుపులు తీసి ప్రమాదం జరిగిపోయిందని చెప్పాడు. జెస్సినియాకు తుపాకీ బుల్లెట్ గాయం కావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. జెస్సినియాకు ఛాతీ భాగంలో బుల్లెట్ గాయం కారణంగా తీవ్ర రక్తస్రావమై ఆస్పత్రిలో చనిపోయింది.


Also Read: భార్య పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. 3 నెలల తరువాత ప్రియురాలితో

పోలీసులు ముందుగా శాంచెజ్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు శాంచెజ్ ని విచారణ చేయగా.. జెస్సినియా, తాను ఇద్దరూ గదిలో నిద్రపోతుండగా.. ఇంట్లో పిల్లాడు గదిలోకి వచ్చి తుపాకీతో జెస్సినియాపై కాల్పులు చేశాడని శాంచెజ్ చెప్పాడు. కానీ పోలీసులు అతడి మాటలను నమ్మలేదు. ముందుగా శాంచెజ్ తుపాకీతో కాల్పులు జరిపి ఇప్పుడు చిన్న పిల్లాడిపై నేరం మోపుతున్నాడని భావించారు. కానీ తుపాకీపై పిల్లాడి వేలి ముద్రలు ఉండడంతో శాంచెజ్ నిజమే చెబుతున్నాడని తేలింది.

నిజానికి శాంచెజ్ వద్ద ఒక 9mm రివాల్వర్ ఉంది. అతను పడకగదిలో ఆ రివాల్వర్ ని సేఫ్టీ లాక్ చేయకుండా పెట్టాడు. పైగా అది పిల్లాడి అందుబాటులో ఉండే స్థానంలో పెట్టాడు. దీంతో పిల్లాడు ఆడుకుంటూ ఆ తుపాకీని తీసుకున్నాడు. ఆ తరువాత నిద్రపోతున్న తన తల్లి వద్దకు వెళ్లి తుపాకీ చూపిస్తూ ఆమెను నిద్ర లేపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఆ తుపాకీ పేలింది. అంతే తుపాకీలోని బుల్లెట్ జెస్సినియా ఛాతీ భాగంలో దూసుకుపోయింది.

పోలీసులు శాంచెజ్ పై తుపాకీ నిర్లక్ష్యం కేసులో అరెస్ట్ చేశారు. అతను చేసిన తప్పు వల్లే ఈ ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేశారు. ఇద్దరు పిల్లలను ప్రస్తుతం జెస్సినియా సోదరికి అప్పగించారు.

అయితే జెస్సినియా సోదరి మాత్రం శాంచెజ్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని.. అతను తుపాకీతో నిర్లక్ష్యంగా తిరుగుతున్నట్లు తన సోదరి జెస్సినియా పలుమార్లు చెప్పిందని పోలీసులకు తెలిపింది.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×