BigTV English
Advertisement

Sandeep Kishan : పేరు మార్చుకున్న యంగ్ హీరో… న్యూమరాలజిని నమ్ముకుంటే లక్ కలిసొస్తుందా?

Sandeep Kishan : పేరు మార్చుకున్న యంగ్ హీరో… న్యూమరాలజిని నమ్ముకుంటే లక్ కలిసొస్తుందా?

Sandeep Kishan : టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోలకు టాలెంట్ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావట్లేదు. ఎంత ప్రయత్నించినా కాలం కలిసి రాక బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన సినిమాలన్నీ బెడిసి కొడుతున్నాయి. పైగా ఇప్పుడున్న పోటీనీ తట్టుకోవడం కూడా కష్టంగా మారింది. యంగ్ జనరేషన్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే దాదాపు దశాబ్దం కిందనే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పలువురు హీరోలు ఇంకా వెనకబడిపోయే ఉన్నారు. అందులో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఈ హీరో ప్రయోగాత్మక సినిమాలు ఎన్నో చేశాడు. అంతేకాకుండా ట్రెండ్ ను కూడా ఫాలో అయ్యాడు. అయితే చాలాకాలంగా సందీప్ కిషన్ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ తన నెక్స్ట్ మూవీ రిలీజ్ కాకముందే పేరు మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి పేరు మార్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? అసలు సందీప్ కిషన్ కొత్త పేరు ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…


పేరు మార్చుకున్న సందీప్ కిషన్

టాలెంట్ ఉండి అదృష్టం కలసిరాని టాలీవుడ్ యంగ్ హీరోలలో సందీప్ కిషన్ కూడా ఒకరు. రీసెంట్ గా ట్రెండుకు తగ్గట్టుగా ఊరు పేరు భైరవకోన అనే సస్పెన్స్ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ హీరో. అయితే సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో మరోసారి ఈ హీరో ఖాతాలో హిట్ పడకుండా పోయింది. ఆ తరువాత రాయన్ అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ ఆయన తమ్ముడిగా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించి అలరించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాకపోతే అందులో సందీప్ కిషన్ మెయిన్ హీరో కాదు కాబట్టి దాన్నిఆయన సినిమా అని చెప్పలేము. ఇక ఈ నేపథ్యంలోనే మజాకా అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు సందీప్. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్ అందుకోవాలని కసితో ఉన్న సందీప్ కిషన్ ఏకంగా తన పేరును మార్చుకున్నాడు. Sundeep Kishan అనే పేరును Subdeep Kishn అని ఛేంజ్ చేసుకున్నాడు ఈ హీరో. తాజాగా రిలీజ్ చేసిన మజాకా మూవీ పోస్టర్లో ఆయన పేరు మార్చుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.


Sundeep Kishan schools a memer for asking inappropriate question about his  co-star Varsha Bollamma | - Times of India

ఈ నమ్మకంతోనే పేరు మార్చుకున్నాడా?

ధమాకా మూవీ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. తమ్ముళ్లు ఈ సంక్రాంతికి సీట్లు లెగుస్తాయి అంటూ 2025 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. అయితే ఆ పోస్టర్లో సందీప్ కిషన్ మారిన పేరుతో పాటు పీపుల్స్ స్టార్ట్ అనే కొత్త ట్యాగ్ కూడా కనిపిస్తోంది. ఆయన ఇలా పేరు మార్చుకోవడానికి వెనకాల గల కారణం న్యూమరాలజీ అంటున్నారు. అయితే న్యూమరాలజీని నమ్ముకుంటే లక్ కలిసి వస్తుందా? ఈ పేరు మార్పు అనేది సందీప్ కెరీర్ ను ఎలా ప్రభావితం చేయబోతోంది ? అనేది ఆసక్తికరంగా మారింది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×