BigTV English

Bigg Boss8 Nikhil : ట్రోఫీ రాగానే మాట మార్చిన నిఖిల్.. అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా..!

Bigg Boss8 Nikhil : ట్రోఫీ రాగానే మాట మార్చిన నిఖిల్.. అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా..!

Bigg Boss8 Nikhil : బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి అయ్యింది.. నిన్న ఆదివారం గ్రాండ్ ఫినాలే ను ఏర్పాటు చేసి విన్నర్ ను అనౌన్స్ చేశారు. కన్నడ బ్యాచ్ నిఖిల్ విన్నర్ అయ్యాడు. ట్రోఫీని అందుకున్నాడు.. అంతేకాదు కోటి రూపాయలు వరకు సంపాదించుకున్నాడు. అయితే నిఖిల్‌ చాలా సెన్సిటివ్‌. చిన్నచిన్న విషయాలకే ఎమోషనలైపోయి కంటతడి పెట్టుకుంటుంటాడు. హౌస్‌లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు.. ఎవరొకరితో ఒక బాండింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక తన లవ్ స్టోరీని రివీల్ చేసి ఎమోషనల్ అయ్యాడు.. విన్నర్ కాకముందేమో ఒకలా, అయ్యాక మరోలా మారాడు… అసలు నిఖిల్ ఎమన్నాడో తెలుసుకుందాం…


కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్‌లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్‌ బంధం నుంచి బయటకు రాలేదు. ఫ్యూచర్ లో కూడా తనే నా భార్య అని ఫిక్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. నా మీద ఆమె కోపంగా ఉంటుందని తెలుసు.. అయిన ఆమె పై నా ప్రేమ చావదు అంటూ పెద్ద పెద్ద మాటలు మాటలు అన్నాడు. నిఖిల్ నిజంగానే అలా అన్నాడేమో అని అతను సిన్సియర్ లవర్ అనుకున్నారు. కానీ ట్రోఫీ గెలిచిన తర్వాత ప్లేటు మార్చేశాడు. నిన్న బిగ్ బాస్ బజ్ లో ఆయన ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం..

తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌లో అడుగుపెట్టిన నిఖిల్‌ను యాంకర్‌ అర్జున్‌ అంబటి ఇదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్‌గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించాడు. కానీ నిఖిల్ మాత్రం కాస్త ఆలోచించాడు. అందుకు నిఖిల్‌ బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.. హౌస్ లో ఉన్నప్పుడు నా ప్రాణం అది అన్నావు కానీ ఇప్పుడు మాత్రం ఇలా అంటున్నావేంటి నిఖిల్.. ఇంతకీ ఆలస్యంగా అయిన ఆమె దగ్గరకు వెళ్తావా లేక మనసు మార్చుకున్నావా అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నిఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి…


బిగ్ బాస్ సీజన్ 8కి ఎండ్ కార్డు పడింది. విన్నర్ ఎవరు? అనేది తెలిసింది.. బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ రేస్‌లో గౌతమ్, నిఖిల్ ఇద్దరు చాలా గట్టి పోటీ ఇచ్చారు. నువ్వా నేనా అన్నంతగా వీరి ఓటింగ్ కొనసాగింది. అయితే, నబీల్ టాప్ 3 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన తర్వాత టాప్ 2లో గౌతమ్, నిఖిల్ ఇద్దరు నిలిచారు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతోపాటు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అదనంగా మరో రూ. 6.79 లక్షలు సంపాదించినట్లే. ఈ లెక్కన నిఖిల్‌ సుమారుగా రూ. 62 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.. మొత్తానికి దాదాపుగా కోటి రూపాయలు సంపాదించుకున్నాడు.

Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×