E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ఇజ్జత్‌ తీసిన అమ్ము – మిస్సమ్మ నాటకం తెలుసుకున్న నిర్మల

Nindu Noorella Saavasam Serial Today December 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ఇజ్జత్‌ తీసిన అమ్ము – మిస్సమ్మ నాటకం తెలుసుకున్న నిర్మల
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  మనోహరి కిచెన్‌లో కాఫీ చేస్తుంటే నవ్వుతూ అక్కా మీకు ఒకటి చూపిస్తాను రండి అంటూ ఆరును కిచెన్‌ డోర్‌ దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తుంది. అక్కడ చూసిన గుప్త, ఆరును బాలిక ఇక్కడ ఏం జరుగుతుందని మనం ఇక్కడకు వచ్చాము అని అడుగుతాడు. నాకు తెలిశాక నీకు చెప్తాను అంటుంది ఆరు. అక్కా మీకు తెలిస్తే ఎవరికి చెప్తారు అంటూ అడుగుతుంది మిస్సమ్మ. తెలిశాక చెప్తాను అటు చూడు అంటుంది ఆరు. ఏంటి మిస్సమ్మ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి.. అని గట్టిగా అరుస్తుంటే అక్కా చిన్నగా మాట్లాడండి మీ మాటలు మనుకు వినిపిస్తాయి అంటుంది. నా మాటలు తనకెందుకు వినిపిస్తాయి.. నీకు మాత్రమే వినిపిస్తాయి కదా అంటుంది ఆరు.

మనుకు ఎందుకు వినిపించవు.. నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తాయి అని మిస్సమ్మ అడిగితే నువ్వు దగ్గరగా ఉన్నావు.. మను దూరంగా ఉంది కదా అందుకే నీకు వినిపిస్తాయి అని చెప్తూ.. మనోహరి కాఫీ పెట్టడాన్ని చూపించడానికి నన్ను తీసుకొచ్చావా..? అంటూ అసలు మనోహరి ఏం చేస్తుందో తెలుసా..? ఆయనకు  దగ్గర అవ్వాలని చూస్తుంది. నిన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టాలని చూస్తుంది అని చెప్పగానే మీరైతే మను కాఫీ పెట్టడం చూడండి అక్కా అంటుంది. ఇంతలో మనోహరి కాఫీలో చక్కెర వేస్తుంటే.. అక్కా ఇప్పుడు బాగా చూడండి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానే మీకు అర్థం అవుతుంది అని ఆరు చెప్పగానే.. చూస్తున్నాం.. ఏమైంది అక్కడ అని చెప్పగానే.. అయ్యో బాగా చూడండి అక్కా.. మను కాఫీ పెట్టడంలో ఏ తప్పు కనిపించడం లేదా..? అంటుంది మిస్సమ్మ..

Advertisement

అవును ఇంట్లో డబ్బాల మీద పేర్లు ఎప్పటి నుంచి రాశారు అని ఆరు అడగ్గానే ఈరోజు నుంచే అని మన వేస్తుంది షుగర్‌ కాదు సాల్ట్‌ అని చెప్తుంది. దీంతో గుప్త బాలిక నువ్వు రోజురోజుకు ఇంత కిరాతకంగా తయారవుతున్నావు అంటాడు. ఇంతలో మనోహరి ఎక్స్‌ ట్రా షుగర్‌ వేద్దాం.. తియ్యని కాఫీ తాగి అమర్‌ ఇంకా ఇంప్రెస్‌ అవుతాడు అని కాఫీ తీసుకుని అమర్‌ దగ్గరకు వెళ్తుంది. మిస్సమ్మ, ఆరు, గుప్త పక్కకు వెళ్లి దాక్కుంటారు. మను ఆయనకు సాల్ట్ కాఫీ ఇస్తుంది మిస్సమ్మ మనున ఆపు అంటుంది ఆరు. నేను ఆపను ఆయనకు, దానికి పనిష్‌ మెంట్‌ ఇవ్వాల్సిందే పైకి వెళ్లి చూద్దాం రండి అని పైకి వెళ్తుంది మిస్సమ్మ. పైకి వెళ్లిన ముగ్గురు కిటికీ దగ్గర నిలబడి చూస్తుంటారు. అక్కా కిటికీ దగ్గర నుంచి చూస్తుంటే భలేగా ఉంది అంటుంది మిస్సమ్మ..

మనోహరి కాఫీ తీసుకెళ్లి తీసుకో అమర్‌ నీకోసం స్పెషల్‌గా చేశాను అని ఇస్తుంది. అమర్‌ కాఫీ తాగబోతుంటే.. అమర్‌ ఇకనుంచి నన్నే కాఫీ అడుగుతావు చూడు అంటుంది మనోహరి. కాఫీ తాగిన అమర్‌ మొత్తం ఊదేస్తాడు. కిటికీలోంచి చూస్తుంన్న మిస్సమ్మ హ్యాపీగా గంతులేస్తుంది. ఇప్పుడు నా ఫర్మామెన్స్‌ చూడండి అక్కా ఇక్కడే ఉండండి అంటూ లోపలికి ఎవండి అంటూ పరుగెడుతుంది. అయ్యో ఏమైందండి.. అంటూ దగ్గరకు వెళ్లి మీకే కాలేదు.. కదా..? వాటర్‌ తాగుతారా..? ఒక్క నిమిషం అంటూ వాటర్‌ తీసుకెళ్తుంది. ఏవండి తీసుకోండి తాగండి అని వాటర్ ఇస్తుంది. ఎందుకలా అరిచారు డాడ్‌ అని అంజు అడుగుతుంది.

Advertisement

కాఫీ అంటూ అమర్‌ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివరాం కాఫీ తాగి ఉమ్మేసి.. ఈ కాఫీ పెట్టిన మాత ఎవరు అంటూ అడగ్గానే నేనే అంకుల్‌ షుగర్‌ ఏమైనా తక్కువైందా..? అని అడుగుతుంది. షుగర్‌ ఏంటి కాఫీలో కాస్త ఉప్పు ఎక్కువైంది.. కాదు కాదు ఉప్పులో కాఫీ కాస్త తక్కువైంది అంటాడు శివరాం. ఉప్పా.. ఉప్పు ఎందుకు ఉంటుంది అంటూ మనోహరి ప్రశ్నిస్తుంది. అది మీరే కదా ఆంటీ చెప్పాల్సింది అని అమ్ము అడుగుతుంది. నేను షుగర్‌ అని రాసి ఉన్న బాక్స్‌ లోంచే తీసి షుగర్‌ తీసి వేశాను అని చెప్తుంది. ఇంతలో మిస్సమ్మ.. నిర్మలకు సైగ చేస్తుంది. ఇంతలో అమ్ము ఏంటి రాసి పెట్టి ఉంటే వేశారా..? ఆంటీ.. మీకు షుగరుకు సాల్ట్‌కు తేడా తెలియదా..? అని అడుగుతుంది.

దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో శివరాం, నిర్మల తమ నాటకం మొదలు పెడతారు. అమర్‌కు మనోహరికి ఏంటి సంబంధం.. మనోహరికి ఈ ఇంటికి ఏంటి సంబంధం అంటూ అడుగుతాడు శివరాం. కడదాకా కలిసుండేది మీరైతే మధ్యలో రావడానికి మనోహరి ఎవరు..? అమ్మా మనోహరి నువ్వు మరోసారి రాకు.. నీ పేరు చెప్పి పనులు తప్పించుకోవాలని చూస్తుంది అని నిర్మల అంటుంది. మీ ఆంటీ చెప్పింది నిజమే మనోహరి. నవ్వు ఇక ఈ గది వైపు కూడా రాకూడదు.. అని చెప్తాడు శివరాం. తర్వాత అందరినీ బయటకు వెళ్లమని మిస్సమ్మ చెప్తుంది. అందరూ వెళ్లిపోతారు.

బయటకు వచ్చిన మనోహరికి మిస్సమ్మ వార్నింగ్‌ ఇస్తుంది. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియడానికి చిన్న  శాంపిల్‌ చూపించాను. ఇకపై నా దగ్గర జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత గార్డెన్‌లో కూర్చున్న ఆరు, మిస్సమ్మ, నిర్మల, శివరాంల యాక్టింగ్‌ ను పొగుడుతుంది. ఏం ఫర్మామెన్స్‌ ఇచ్చారు అని చెప్తుంది. దీంతో గుప్త పొంచి ఉన్న ప్రమాదం నీకు అవగతం అవ్వడం లేదు అని హెచ్చరించడంతో ఎందుకు గుప్త గారు అలా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ ఘోర వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఘోర వెళ్లిపోయాడు కదా.. అంటుంది ఆరు. అది నీ ఊహ మాత్రమే బాలిక అని గుప్త అనడంతో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Brahmamudi Serial Today Episode November 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇంట్లో మార్పులకు రాజు  శ్రీకారం – అయోమయంలో రేఖ

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? అడ్డంగా బుక్కయిన అరుణ్.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రిపోర్ట్.. ఆ సీరియల్ కు బిగ్ షాక్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×