BigTV English

Bigg Boss 8 Telugu : డబుల్ ఎలిమినేషన్ ఉందా?.. హౌస్ లోకి యంగ్ హీరో ఎంట్రీ?

Bigg Boss 8 Telugu : డబుల్ ఎలిమినేషన్ ఉందా?.. హౌస్ లోకి యంగ్ హీరో ఎంట్రీ?

Bigg Boss 8 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఎనిమిదో సీజన జరుగుతుంది.. ప్రస్తుతం నాలుగో వారం ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశారు. గత మూడు ఎలిమినేషన్ల ఒక ఎత్తు అయితే నాలుగో వారం బిగ్ బాస్ ముద్దు బిడ్డ సోనియా ఆకుల బయటకు వెళ్తుందనే వార్తలు సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ రేంజులో మారుమ్మోగిపోతున్నాయి. మొదటి నుంచి దురుసుగా ఉంటున్న సోనియా కొన్ని మిస్టేక్స్ చెయ్యడం వల్లే జనాలకు చిరాకు వచ్చి ఓటింగ్ వేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది.


నాలుగోవారం డబుల్ ఎలిమినేషన్ ఉందా?

బిగ్ బాస్ 8 తెలుగు షోలో ఉత్కంట మొదలైంది.. వీకెండ్ ఎపిసోడ్స్ వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఆలోచనలో ఉంటారు. వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎలిమినేషన్ ఉంటుంది. అలాగే ఈ వారం కూడా ఆదిత్య ఓం వెళ్తారని అందరు అనుకున్నారు. కానీ సోనియా ఎలిమినేట్ అవుతుందని టాక్. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట షికారు చేస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మణికంఠ వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. మణికంఠ ఆట కొంచెం డౌన్ అయ్యిందని అందుకే బిగ్ బాస్ అతన్ని ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఎవరిని ఈరోజు బిగ్ బాస్ బయటకు పంపిస్తారో ఆసక్తిగా మారింది.


హౌస్ లోకి న్యూ కంటెస్టెంట్ ఎంట్రీ?

బిగ్ బాస్ హౌస్లో ట్విస్ట్ లతో టాస్క్ లు ఇవ్వడం మాత్రమే కాదు.. కొత్త వాళ్లను హౌస్ లోకి తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. గతంలో ఇద్దరు, ముగ్గురు కొత్త వాళ్లను తీసుకొచ్చారు. అలాగే ఈ ఏడాది కూడా నాలుగో వారం కొత్త కంటెస్టెంట్ రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే హౌస్ లోకి ఎవరు వస్తారన్నది మాత్రం కాస్త ఆసక్తిగా మారింది. అందుతున్న సమాచారం మేరకు హౌస్ లోకి కంటెస్టెంట్ గా గత సీజన్ లో అలరించిన డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాడని టాక్.. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నలుగురు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక హరితేజ, ఇనయా సుల్తానా, రోహిణి, ముక్కు అవినాస్ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఎవరిని తీసుకొస్తారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఇక విన్నర్ గా ఈ సీజన్ కిరాక్ సీత అవుతుందని సోషల్ మీడియాలో అప్పుడే వార్తలు వినిపిస్తున్నాయి. చివరికి ఎవరు అవుతారో చూడాలి..

Related News

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Big Stories

×