BigTV English

OTT Movie : బావి వల్ల ఒక్కొక్కరుగా టీనేజర్స్ మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ

OTT Movie : బావి వల్ల ఒక్కొక్కరుగా టీనేజర్స్ మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ

OTT Movie : కటౌట్ కాకుండా కంటెంట్ ను నమ్ముకుని వచ్చే చాలా సినిమాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయి. ఇక్కడైతే ప్రేక్షకులే డైరెక్ట్ గా తీర్పుని ఇస్తారు. థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలకు కూడా ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.  ఇలా ఇప్పటిదాకా బిగ్ స్క్రీన్ పై రిజెక్ట్ అయిన సినిమాలెన్నో ఓటీటీలో భారీ వ్యూస్ తో దుమ్మురేపడం చూశాం మనం. కాబట్టి ఓటీటీలో అయితే ప్రేక్షకులు ఇచ్చే తీర్పుతో సినిమా ఎంత వరకు బాగుంది అనే విషయం జెన్యూన్ గా తెలిసిపోతుంది. ఇక అలా ప్రేక్షకులు ఓటీటీలో ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో హారర్, కామెడీ, థ్రిల్లర్స్ జానర్ల మూవీస్ ఉంటాయి. అందులోనూ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాల కోసం సపరేట్ గా ఓ వర్గం మూవీ లవర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఆ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు రాధాకృష్ణన్ పార్దిబమ్ దర్శకత్వం వహించారు. సినిమా మొత్తం ఎనిమిది మంది టీనేజ్ అబ్బాయి, ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న తమిళంలో థియేటర్లలోకి వచ్చింది. సరిగ్గా రెండు నెలల్లో ఓటిటిలోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 12 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ ఒక లుక్కేయండి. అంతకంటే ముందు స్టోరీ చదివేయండి.


స్టోరీ లోకి వెళ్తే…

సినిమాలో మొత్తం 13 మంది టీనేజర్లు ఉంటారు. వాళ్లు తమ ఏజ్ లో ఉన్న అందరిలాగే క్లాస్ బంక్ కొట్టి బయటకు వెళ్తారు. కానీ ఈ టీనేజర్స్ తీసుకున్న ఆ నిర్ణయమే వాళ్ళను ప్రమాదంలో పడేస్తుంది. ఈ టీనేజర్లలో ఒక అమ్మాయి పేరు నక్షత్ర. ఆమె నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్లాలని వెళ్లాలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆ ఊర్లో 500 ఏళ్ల క్రితం బావి ఒకటి ఉంటుంది. అందులో దయ్యాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని నిజమా కాదా అని తెలుసుకోవడంతో పాటు వాళ్ళు ధైర్యవంతులం అని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అనుకున్నట్టుగానే స్కూల్ ఎగ్గొట్టి ఆ ఊరికి వెళ్తారు. కానీ ఈ క్రమంలో ఈ టీనేజర్లలో ఒక్కొక్కరుగా మిస్ అవుతారు. చివరికి మిగిలింది ఎవరు? వాళ్లకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి? ఇందులో ఎంత మంది బతికి బయట పడగలిగారు? అసలు ఆ బావి స్టోరీ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘టీన్జ్’ అనే ఈ తమిళ సినిమాను ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే. ముఖ్యంగా అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి ఆప్షన్ అవుతుంది.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×